Stock Market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
Stock Market: భారీగా పతనమైన యాక్సిస్ బ్యాంక్ షేర్ విలువ
Representational Image
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు ఆ వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. ట్రేడింగ్ ఆద్యంతం ఒడిదుడుకులను ఎదుర్కొన్న మార్కెట్లు చివరకు నష్టాల్లో ముగిశాయి. ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 206 పాయింట్లు కోల్పోయి 61వేల 143కి పడిపోయింది. అటు నిఫ్టీ 57 పాయింట్లు నష్టపోయి 18వేల 210 దగ్గర స్థిరపడింది.