Gold Price Today: పరుగులు పెడుతున్న పసిడి, వెండి ధరలు

Update: 2021-07-30 02:15 GMT

పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలు

Gold,Sliver Price Today: గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న పసిడి ధరలు శుక్రవారం మాత్రం ధర పైకి పరుగులు పెట్టింది. అదే దారిలో వెండి కూడా భారీగా పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చింది. శుక్రవారం హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 పెరిగడంతో బంగారం ధర రూ.48,990 కు చేరింది. అదేవిధంగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా అదే దారిలో పయనించి రూ.100 పెరుగుదలతో రూ.44,900కు చేరింది.

ఇక బంగారం ధర ఇలా ఉంటే వెండి రేటు కూడా అదే దారిలో పెరిగింది. వెండి రేటు రూ.800 పెరగడంతో కేజీ వెండి ధర రూ.72,200 ఎగసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర దిగొచ్చింది. ఔన్స్‌కు 0.08 శాతం క్షీణించింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1829 డాలర్లకు తగ్గింది. వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 0.61 శాతం తగ్గుదలతో 25.62 డాలర్లకు క్షీణించింది.

Tags:    

Similar News