Gold Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు

* Gold Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు

Update: 2021-07-27 02:17 GMT

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

Gold Price Today: సోమవారం నిలకడగా ఉన్న బంగారం, వెండి ధరలు మంగళవారం దేశీయ మార్కెట్ లో స్వల్పంగా పెరగగా మరోవైపు అంతర్జాతీయ మార్కెట్ లో మాత్రం బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఇక హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం బంగారం ధర స్వల్పంగా పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 పైకి చేరడంతో ప్రస్తుతం బంగారం ధర రూ.48,880 కు పెరిగింది. మరోపక్క 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.100 పెరగడంతో రూ.44,800 కు చేరింది.

ఇక బంగారం ధర పెరగడంతో పాటు వెండి రేటు కూడా మంగళవారం స్వల్పంగా పెరిగింది. హైదరాబాద్‌ మార్కెట్ లో వెండి రేటు రూ.100 పెరగడంతో కేజీ వెండి ధర రూ.72,100 చేరింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర తగ్గింది. 0.09 శాతం పడిపోయింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1797 డాలర్లకు దిగొచ్చింది. వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 0.53 శాతం తగ్గుదలతో 25.18 డాలర్లకు క్షీణించింది.

Tags:    

Similar News