Gold, Silver Price Today: డౌన్ ట్రెండ్ లో బంగారం ధరలు

Gold Price Today: దేశవ్యాప్తంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా, వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది.

Update: 2021-06-16 01:21 GMT

Gold, Silver Price Today: (File Image)

Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని వెల్లడిస్తున్నారు. తాజాగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పడుతున్నాయి. బుధవారం 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.160 మేర తగ్గింది. ప్రస్తుతం పది గ్రాముల ధర రూ.47,600 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,600 వద్ద కొనసాగుతోంది.

దేశంలోని వివిధ నగరాల్లో...

దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఈ రోజు 47,650 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర 51,800 గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,600 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 48,600 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 45,500 గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 49,630 వద్ద ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 45,760 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,920 వద్ద కొనసాగుతోంది.బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,640 వద్ద ట్రేడ్ అవుతోంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,640 వద్ద ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో...

హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,500 ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.49,630 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 45,500 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.49,630 వద్ద వుంది. విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 45,500 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 49,630 వద్ద ట్రేడ్ అవుతోంది.

వెండి ధరలు...

ప్రపంచంలో, దేశంలో చోటు చేసుకుంటున్న పలు ఆర్థిక, పలు పరిణామాల వల్ల బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటాయి. బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా, వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. బుధవారం కూడా వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. కిలో వెండికి 400 రూపాయలు తగ్గింది. దీంతో కిలో వెండి ధర 71,500 రూపాయలు ఉంది

దేశంలో ప్రధాన నగరాల్లో...

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 71,500 గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ. 71,500 గా ఉంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో రూ.71,500 వద్ద కొనసాగుతోంది. కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.71,500 వద్ద ఉంది. తమిళనాడు రాజధాని చెన్నైలో కిలో వెండి ధర రూ.75,900 ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో..

హైదరాబాద్‌లో వెండి కిలో రూ.75,900 లు ఉంది. విజయవాడలో వెండి రూ.75,900లు వద్ద కొనసాగుతోంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 16-06-2021 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News