Today Gold, Silver Rate: దిగొచ్చిన పసిడి, వెండి ధరలు

Update: 2021-08-07 02:30 GMT

Representation Photo

Today Gold, Silver Rate: బంగారం ధర మరోసారి పడిపోయింది. పసిడి ధర తగ్గడం ఇది వరుసగా రెండో రోజు. బంగారంతో పాటు వెండి రెట్లు కూడా దిగోచ్చాయి. హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం బంగారం ధర భారీగా పడిపోయింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.220 తగ్గడంతో బంగారం ధర రూ.48,660కు దిగొచ్చింది. ఇక అదే విధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.200 దిగి రావడంతో రూ.44,600కు పడిపోయింది.

మరోపక్క పసిడి ధర దిగివస్తే వెండి ధరలు కూడా పడిపోయాయి. వెండి రేటు రూ.600 తగ్గడంతో కేజీ వెండి ధర రూ.71,700 కు దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర భారీగా తగ్గింది. ఔన్స్‌కు 2.51 శాతం పడిపోవడంతో పసిడి రేటు ఔన్స్‌కు 1763 డాలర్లకు తగ్గింది. వెండి రేటు కూడా దిగిరావడంతో ఔన్స్‌కు 3.80 శాతం తగ్గుదలతో 24.33 డాలర్లకు క్షీణించింది.

Tags:    

Similar News