Gold Price: పసిడి ప్రియులకు శుభవార్త.. ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Gold Price: 1500 రూ. తగ్గిన 24 క్యారెట్ల బంగారం ధర

Update: 2024-04-23 06:25 GMT

Gold Price: పసిడి ప్రియులకు శుభవార్త.. ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Gold Price: పసిడి ప్రియులకు శుభవార్త. ఏప్రిల్ ప్రారంభం నుంచి భారీగా పెరిగిన బంగారం ధరలు ఎట్టకేలకు తగ్గుముఖం పట్టాయి. ఇవాళ తులం పసిడి ధర గరిష్టంగా రూ. 1530 తగ్గింది. హైదరాబాద్‌, విజయవాడలలో ఇవాళ ఒక తులం 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.66,150 కాగా.. 24 క్యారెట్ల బంగారం రూ.72,160 వద్ద స్థిరపడ్డాయి. నిన్న రూ. 500 నుంచి రూ. 550 వరకు తగ్గిన గోల్డ్ రేటు.. ఈ రోజు మళ్ళీ ఏకంగా 1400 రూపాయల నుంచి రూ. 1500 రూపాయలకు తగ్గింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా నేడు బంగారం ధరలు భారీగానే తగ్గాయి. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు 66,300 రూపాయలు.. 24 క్యారెట్ల ధర 72310 రూపాయలకు చేరింది.

నిన్న రూ.510, రూ.550 వరకు తగ్గిన గోల్డ్ రేటు.. ఈ రోజు రూ. 1400 నుంచి రూ.1530 వరకు తగ్గింది. దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే.. చెన్నైలో పసిడి ధరలు మరింత తగ్గినట్లు స్పష్టమవుతోంది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు 1450 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 1570 రూపాయలు తగ్గింది. దీంతో 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 67,000 చేరుకోగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 73,100 కు చేరింది. మరోవైపు బంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. ఇవాళ వెండి ధర రూ.2500 తగ్గి రూ. 83,000 వద్ద నిలిచింది. చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ నగరాల్లో కూడా వెండి ధరలు గరిష్ట స్థాయిలో తగ్గుముఖం పట్టాయి.

Tags:    

Similar News