Tik Tok Alternate: ఇప్పుడు యూట్యూబ్ 'షార్ట్స్'..అచ్చంగా 'టిక్ టాక్' లానే!
Tik Tok Alternate : భారత్, చైనాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతల నేపధ్యంలో జూన్‌లో టిక్‌టాక్ తో పాటుగా 58 ఇతర చైనా యాప్‌లను భారత ప్రభుత్వం
YouTube launches rival to be tested in India
Tik Tok Alternate : భారత్, చైనాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతల నేపధ్యంలో జూన్‌లో టిక్‌టాక్ తో పాటుగా 58 ఇతర చైనా యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే.. అయితే అప్పటికే టిక్‌టాక్ కి 120 మిలియన్ల వినియోగదారులను కలిగి ఉన్నారు. అయితే టిక్‌టాక్ నిషేధం తర్వాత ఆ గ్యాప్ ని పూరించడానికి పలు సంస్థలతో పాటుగా యూట్యూబ్ కూడా పోటిపడుతుంది. అయితే తాజాగా "షార్ట్స్" పేరుతో టిక్‌టాక్ లాంటి షార్ట్ వీడియో ఫీచర్‌ను లాంచ్ చేసింది యూట్యూబ్..ఈవిషయాన్ని యూట్యూబ్ ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్ క్రిస్ జాఫ్ఫ్ ఒక బ్లాగ్ పోస్ట్‌లో వెల్లడించారు.
15సెకన్ల నిడివిలో లఘు చిత్రాలు, ఆకర్షణీయమైన వీడియోలను షూట్ చేసుకునే అవకాశాన్ని కల్పించినట్టుగా అయన వెల్లడించారు. దీనికి సంబంధించిన మరిన్ని ఫీచర్లను త్వరలోనే జత పరుస్తామని అయన వెల్లడించారు. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ ద్వారానే దీనిని అందుబాటులోకి తీసుకురాగా, త్వరలోనే ఐఓఎస్ లో కూడా లాంచ్ చేయనున్నారు. ఇక ఈ కొత్త ప్లాట్‌ఫామ్‌లో బహుళ వీడియో క్లిప్‌లను స్ట్రింగ్ చేయడానికి బహుళ-సెగ్మెంట్ కెమెరా, స్పీడ్ కంట్రోల్స్ మరియు హ్యాండ్స్-ఫ్రీని రికార్డ్ చేయడానికి టైమర్ మరియు కౌంట్‌డౌన్ ఫీచర్లు కూడా ఉన్నాయి.