Business Idea: నేటి రోజుల్లో ఈ వ్యాపారం చాలా బెస్ట్.. లక్షల్లో సంపాదించే అవకాశం..!

Business Idea: మీరు సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ఇంట్లో చిన్న హాలు ఉంటే చాలు సులభంగా ప్రారంభించవచ్చు.

Update: 2023-01-10 13:30 GMT

Business Idea: నేటి రోజుల్లో ఈ వ్యాపారం చాలా బెస్ట్.. లక్షల్లో సంపాదించే అవకాశం..!

Business Idea: మీరు సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ఇంట్లో చిన్న హాలు ఉంటే చాలు సులభంగా ప్రారంభించవచ్చు. ప్రస్తుతం ప్రజల జీవన విధానంలో చాలా మార్పులు వచ్చాయి. దీని వల్ల అనేక రకాల వ్యాధులు పెరుగుతున్నాయి. ఈ వ్యాధులను ఎదుర్కోవటానికి ప్రజలు వ్యాయామం ఎంచుకుంటున్నారు. ఈ పరిస్థితిలో మీరు జిమ్ లేదా ఫిట్‌నెస్‌ సెంటర్‌ ప్రారంభిస్తే మంచి ఆదాయాన్ని పొందవచ్చు. ఈ వ్యాపారానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ ఫిట్‌గా ఉండాలని కోరుకుంటారు. అందుకే జిమ్‌కి డిమాండ్ బాగా పెరిగింది. జిమ్ వ్యాపార పరిధి విస్తరించింది. కరోనా కాలం నుంచి ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెరిగింది. అందరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మొదలుపెట్టారు. రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి అనేక రకాల చర్యలు తీసుకుంటున్నారు.

భారతదేశంలో రెండు రకాల జిమ్‌లు ఉన్నాయి. వెయిట్ లిఫ్టింగ్ జిమ్, కార్డియో పరికరాలతో కూడిన జిమ్. వెయిట్ లిఫ్టింగ్ జిమ్‌లో బరువులు ఎత్తడం మొదలైనవి ఉంటాయి. ఇందులో బరువు తగ్గడం, కండలు పెంచడం వంటి అంశాలపై శిక్షణ ఇస్తారు. దీని కోసం శిక్షణ తీసుకున్న ట్రైనర్‌ ఉంటాడు. యంత్రాలపై జ్ఞానం, అవగాహన ఉండటం కూడా అవసరం.

ఫిట్నెస్ సెంటర్

ఇది కాస్త ఖరీదైన జిమ్. ఇందులో బరువు పెరగడం, తగ్గడం, ఆరోగ్యంగా జీవించడం వంటి అంశాలకు సంబంధించి శిక్షణలు ఇస్తారు. ఈ రకమైన జిమ్‌లో ఏరోబిక్స్, యోగా, అనేక రకాల ఆసనాలు, మార్షల్ ఆర్ట్స్ మొదలైనవి ఉంటాయి. కోచ్‌కి కూడా ఈ విషయాలన్నింటిపై మంచి అవగాహన ఉండటం అవసరం.

జిమ్ తెరవడానికి లైసెన్స్ అవసరం. దీని కోసం మీరు పోలీసుల నుంచి NOC తీసుకోవాలి. ఇది వ్యక్తిగతంగా లేదా ఆన్‌లైన్‌లో పొందవచ్చు. మీరు స్థానిక పోలీసుల నుంచి దీని గురించి మరింత సమాచారాన్ని సేకరించవచ్చు. మీరు జిమ్ ప్రారంభించాలనుకుంటే ముందుగా మంచి స్థలాన్ని ఎంచుకోవాలి. దీనికి అయ్యే ఖర్చును లెక్కించాలి. భారత ప్రభుత్వం పరిమిత లేదా ప్రైవేట్ లిమిటెడ్ జిమ్‌ల నమోదును అందిస్తుంది.

జిమ్ యొక్క లాభం ఆ ప్రాంతంపై ఆధారపడి ఉంటుంది. మీరు వ్యాయామశాలను ఎక్కడ ప్రారంభించారు.. జిమ్‌లోని కస్టమర్‌ల సంఖ్య, వారి ఫీజులపై ఆధారపడి ఉంటుంది. స్థూల లెక్కన చూస్తే జిమ్‌లో 50 నుంచి 80 లక్షల వరకు పెట్టుబడి పెడితే ఏటా దాదాపు 10 నుంచి 20 లక్షల వరకు రాబట్టవచ్చు. రీసెర్చ్ ఏజెన్సీ ప్రకారం భారతదేశంలో ఫిట్‌నెస్ వ్యాపారం 4,500 కోట్లకు చేరుకుంది. ప్రతి సంవత్సరం 16-18 శాతం వృద్ధి చెందుతోంది.

Tags:    

Similar News