వంటగ్యాస్ సబ్సిడీపై కేంద్రం మరో నిర్ణయం.. దాదాపు 30 వేల కోట్లు ఖర్చు..!

LPG Subsidy: దేశవ్యాప్తంగా పెరుగుతున్న గ్యాస్‌ ధరలపై ప్రజలలో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది.

Update: 2022-09-16 04:57 GMT

వంటగ్యాస్ సబ్సిడీపై కేంద్రం మరో నిర్ణయం.. దాదాపు 30 వేల కోట్లు ఖర్చు..!

LPG Subsidy: దేశవ్యాప్తంగా పెరుగుతున్న గ్యాస్‌ ధరలపై ప్రజలలో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. అయితే చౌక ధరలో గ్యాస్‌ సిలిండర్‌ అందించడానికి కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఎల్‌పిజి ధరలను నియంత్రించేందుకు అదనపు సబ్సిడీని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. దాదాపు రూ.25,000 నుంచి 30,000 కోట్ల వరకు ఖర్చు చేయవచ్చు. అయితే 2022-23 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అంచనాలలో కేటాయించిన రూ. 58,012 కోట్లు.

వంటగ్యాస్ సిలిండర్ల ధరల పెరుగుదల కారణంగా సామాన్యుల జేబుపై చాలా ప్రభావం పడుతోంది. ఈ ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఒక్క సంవత్సరంలో సిలిండర్ ధర.244 రూపాయలు పెరిగింది. చివరిసారిగా జూలైలో సిలిండర్‌పై రూ.50 పెరిగింది. ప్రస్తుతం ఢిల్లీలో 14.2 కేజీల సబ్సిడీ లేని ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.1,053కి పెరిగింది. మరోవైపు ఉజ్వల పథకం లబ్ధిదారులు రూ.853కే పొందుతున్నారు.

ఉక్రెయిన్‌పై రష్యా దాడుల కారణంగా ప్రపంచ మార్కెట్‌లో చమురు, గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. ఇది దేశంలోని LPG ధరలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. గత రెండేళ్లలో ఎల్‌పీజీ ధర 28 శాతం పెరిగింది. వంటగ్యాస్‌కు ప్రభుత్వం అదనపు రాయితీని ఇవ్వడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కేంద్రం ఉజ్వల పథకానికి బడ్జెట్‌లో కేటాయించిన సబ్సిడీకి భిన్నంగా అదనపు సబ్సిడీ ఉంటుంది. ఇటీవల ప్రభుత్వ చమురు కంపెనీలు 19.2 కిలోల కమర్షియల్ ఎల్‌పిజి సిలిండర్ ధరను రూ.91.50 తగ్గించాయి. ఆ తర్వాత ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర రూ.1,976 నుంచి రూ.1,885కి తగ్గింది.

Tags:    

Similar News