తెలంగాణాలో మరోసారి లేఅవుట్ రెగ్యులరైజేషన్ !

Update: 2020-09-03 11:51 GMT

అనధికార లేఅవుట్లలో ప్లాట్లుకొన్న యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రం మొత్తం నగరాలు, పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా అందరికి కొత్త స్కీం వర్తిస్తుందని మార్గదర్శకాలు జారి చేసింది. ఓవైపు చాలా కాలంగా పెండిగ్‌లో ఉన్న సమస్యకు పులిస్టాప్ పెట్టడంతో పాటు పెద్ద ఎత్తున రాష్ట్ర ఖజానాకు ఆదాయం సమకూరనుంది.

తెలంగాణలో మరోసారి లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ LRS స్కింను ప్రకటించింది. నెలలుగా ఇదే విషయంపై కసరత్తు చేసిన ప్రభుత్వం ఎట్టకేలకు మార్గ దర్శకాలు జారిచేసింది. కొద్ది వారాల క్రితం అనధికార లే అవుట్లు, అక్రమ నిర్మాణాలకు రిజిస్ట్రేషన్లు చేయవద్దని ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం ప్రజల్లో చర్చనీయాశం అయింది. రిజిస్ట్రేషన్‌ శాఖ తాజా ఆదేశాలతో రాష్ట్రంలో వేలాది అనుమతి లేని వెంచర్లు, లక్షలాదిగా వెలిసిన అక్రమ నిర్మాణాల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. ఇప్పుడు ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీం ద్వారా వాటిని క్రమబద్ధీకరించుకునే అవకాశం కల్పించడంతో వారికి ఊరట లభించింది.

ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రానికి ఆదాయం సమకూరుతుంది. అదే సమయంలో క్రమబద్ధీకరణతో వాటి యజమానులకు కూడా ఊరట కలగనుంది. అక్రమ ప్లాట్లు వెంచర్ల క్రమభద్దీకరణతో వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. అనధికార, అక్రమ వెంచర్లను తొలగిస్తామని, నిర్మాణాలను కూల్చివేస్తామని ప్రభుత్వం ఎంతగా హెచ్చరించినప్పటికీ వాటిని అడ్డుకోలేకపోయారు. తెలంగాణలో పెద్దఎత్తున పట్టణీకరణ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మునిసిపాలిటీలు విస్తరించాయి.

LRS స్కీంలో రాష్ట్రంలో అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు గ్రామపంచాయతీల వరకు లేఅవుట్, అనుమతి వెంచర్ దారులు లక్షల మందికి ఊరట లభిస్తుంది. ఇందులో స్థలాల ఇందుకోసం అక్టోబర్ 15 వరకు ఆన్‌లైన్‌లో ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ ఫామ్ నింపాల్సి ఉంటుంది. ఆగస్టు 26 వరకు కటాఫ్ డేట్‌గా ప్రకటిస్తూ ఎల్ఆర్ఎస్ స్కీమ్‌ను తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ ఫీజును వేయి రూపాయలుగా నిర్ణయించిన ప్రభుత్వం లే అవుట్ అప్లికేషన్ ఫీజును పది వేలుగా ఖరారు చేసింది. 100 గజాలలోపు ప్లాటు కలిగి ఉన్న వాళ్లు రెగ్యులరైజేషన్ ఛార్జీల కింద గజానికి 200 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక 100 నుంచి 300 గజాల వరకు 400 రూపాయలుగా రెగ్యులరైజేషన్ ఛార్జీలు ఖరారు చేశారు. 300 నుంచి 500 వరకు గజానికి 600 రూపాయలు రెగ్యులరైజేషన్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. మురికి వాడల్లోని పేదలకు చదరపు గజానికి ఫ్లాట్ ఏరియాకు భూవిలువతో సంబంధం లేకుండా చదరపు మీటరకు 5గా నిర్ణయించారు. దీంతో చాలా మంది పేదలకు ప్రభుత్వం మంచి చేసినట్టవుతుంది. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వానికి అటు ఆదాయ వనరులతో పాటు అక్రమ వెంచర్లకు విముక్తి లభిస్తుంది. ఇటు లక్షల మంది పేద మధ్య తరగతి ప్రజలు అక్రమ వెంచర్లలో ప్లాట్లు కొన్న వారికి భారీ ఊరట వస్తుంది. దీంతో వచ్చే గ్రేటర్ హైదరాబాదాద్ ఎన్నికలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీకి రాజకీయంగా పెద్ద ఎత్తున లబ్ది కూడా చేకూరుతుంది.


Tags:    

Similar News