Pension Plan: ప్రతి నెలా 5000 పెట్టుబడితో రిటైర్మెంట్ తర్వాత రూ.35000 పెన్షన్ పొందవచ్చు..!

Pension Plan: ప్రతి ఒక్కరూ రిటైర్మెంట్‌ తర్వాత ఖర్చుల గురించి ఆందోళన చెందుతారు.

Update: 2022-05-15 13:15 GMT

Pension Plan: ప్రతి నెలా 5000 పెట్టుబడితో రిటైర్మెంట్ తర్వాత రూ.35000 పెన్షన్ పొందవచ్చు..!

Pension Plan: ప్రతి ఒక్కరూ రిటైర్మెంట్‌ తర్వాత ఖర్చుల గురించి ఆందోళన చెందుతారు. అందుకే ప్రజలు చాలా రకాల స్కీంలలో పెట్టుబడి పెడుతారు. ఇప్పటి వరకు రిటైర్‌మెంట్‌ ప్లానింగ్‌ చేసుకోకపోతే ఇప్పుడు ప్రారంభించండి. రిటైర్మెంట్‌ తర్వాత నెల జీతం ఆగిపోతుంది. అప్పుడు మీకు ప్రతి నెలా పెన్షన్ రూపంలో పెద్ద మొత్తం లభిస్తుంది. మీరు రిస్క్ లేకుండా పెట్టుబడి పెట్టాలనుకుంటే ప్రతి నెలా పెన్షన్‌ పొందే SIPకి భిన్నంగా SWP (సిస్టమాటిక్ విత్‌డ్రావల్) ప్లాన్‌ని అనుసరించవచ్చు. దీని కింద 20 ఏళ్ల పాటు ప్రతి నెలా 5 వేల రూపాయల చొప్పున నెలవారీ SIP చేస్తే ప్రతి నెలా 35 వేల రూపాయల వరకు పెన్షన్ పొందవచ్చు.

సిస్టమాటిక్ విత్‌డ్రావల్ ప్లాన్ (SWP) అనేది మ్యూచువల్ ఫండ్ పథకంలో మీరు పెట్టిన పెట్టుబడి నుంచి కొంత మొత్తాన్ని తిరిగి పొందడం. ఇందులో ఎంత సమయంలో ఎంత డబ్బు విత్‌డ్రా చేయాలనేది పెట్టుబడిదారుడే నిర్ణయిస్తాడు. SWP కింద మీరు మీ డబ్బును రోజువారీ, వారానికి ఒకసారి, నెలవారీ, త్రైమాసిక, 6 నెలలు లేదా వార్షిక ప్రాతిపదికన విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ పద్దతి 5000 పెట్టుబడి పెట్టి పెన్షన్ ఎలా పొందవచ్చో తెలుసుకుందాం.

20 సంవత్సరాల వరకు నెలవారీ 5000 రూపాయలు మ్యూచ్‌వల్ ఫండ్స్‌లో SIP ద్వారా ఇన్వెస్ట్ చేయాలి. దీనివల్ల అంచనా రాబడి 12% వరకు ఉంటుంది. అంటే దాదాపు రూ. 50 లక్షలు ఇప్పుడు దీని కంటే ఎక్కువ లాభం కోసం మీరు ఈ 50 లక్షల రూపాయలను SWP కోసం వివిధ పథకాలలో పెట్టుబడి పెట్టాలి. అప్పుడు ఈ 50 లక్షలు పెట్టుబడిపై వార్షిక రాబడి రూ. 4.25 లక్షలు ఉంటుంది.

నెలవారీ రాబడి 4.25 లక్షలు/12 = రూ. 35417 అవుతుంది.

Tags:    

Similar News