Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. స్టాక్ మార్కెట్లకు నేడు బ్లాక్ మండే
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లలో ఈ రోజు బ్లాక్ మండే కొనసాగుతోంది.
Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. స్టాక్ మార్కెట్లకు నేడు బ్లాక్ మండే
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లలో ఈ రోజు బ్లాక్ మండే కొనసాగుతోంది. మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఉదయం భారీ నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు అదే ట్రెండ్ ను కొనసాగిస్తున్నాయి. ఉదయం సెన్సెక్స్ ఏకంగా 1,034 పాయింట్లు పతనమై.. 57,815కి పడిపోయింది. మధ్యాహ్నం కూడా మార్కెట్లు నష్టాల బాటలోనే పయనిస్తున్నాయి. సెన్సెక్స్ సుమారు 700 పాయింట్లు నష్టపోయింది.
అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో దేశీయ బెంచ్ మార్క్ సూచీలు భారీగా పతనమయ్యాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్ ఛైర్ పర్సన్ వడ్డీ రేట్లు పెంచక తప్పదని స్పష్టం చేశారు. ఈ ప్రకటన ప్రభావం భారత స్టాక్ మార్కెట్లపై పడిందని విశ్లేషకులు చెబుతున్నారు.