కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. ఇన్ఫోసిస్ షేరు భారీగా పతనం

Stock Market Today: నాలుగు రోజుల విరామం తర్వాత ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌ భారీ నష్టాలను చవి చూసింది.

Update: 2022-04-18 15:30 GMT

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. ఇన్ఫోసిస్ షేరు భారీగా పతనం

Stock Market Today: నాలుగు రోజుల విరామం తర్వాత ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌ భారీ నష్టాలను చవి చూసింది. ఇవాళ ఉదయం మార్కెట్‌ ప్రారంభంతోనే నష్టాల పరంపర మొదలైంది. గత వారం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 58 వేల 338 పాయింట్ల దగ్గర క్లోజయ్యింది. ఈరోజు ఉదయం వెయ్యి పాయంట్లు నష్టపోతూ 57 వేల 338 పాయింట్లతో ప్రారంభమైంది. ఆ తర్వాత కూడా ఎక్కడా మార్కెట్‌కు ఉత్తేజ పరితే పరిణామాలు చోటు చేసుకోకపోవడంతో అమ్మకాల ఒత్తిడి కొనసాగింది.

ఫలితంగా కొత్త టైం టేబుల్‌ ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటల సమయానికి ఒక వెయ్యి 172 పాయింట్ల నష్టంతో 57 వేల 166 పాయింట్ల దగ్గర సెన్సెక్స్‌ క్లోజయ్యింది. నిఫ్టీ సైతం 302 పాయింట్లు నష్టపోయి 17 వేల 173 పాయింట్ల దగ్గర ముగిసింది. ఇటు సెన్సెక్స్‌, అటు నిఫ్టీ రెండు సూచీలు భారీగా నష్టపోవడంతో ఒక్కరోజులోనే 3 లక్షల 39 వేల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ముఖ్యంగా ఇన్ఫోసిస్‌ షేరు ధర ఒక్క రోజులో 124 రూపాయలు పడిపోవడంతో ఆ కంపెనీ మార్కెట్‌ విలువలో సుమారు 48 వేల కోట్ల రూపాయల సంపద ఆవిరైంది.

Tags:    

Similar News