Equity Market: దేశీ ఈక్విటీ మార్కెట్లు లాభాల బాట
Equity Market: సెన్సెక్స్ 248 పాయింట్ల లాభంతో 52,621 * నిఫ్టీ 75 పాయింట్లు లాభపడి 15,766 వద్ద కొనసాగుతున్న వైనం
Representational Image
Equity Market: దేశీ ఈక్విటీ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపధ్యంలో దేశీ సూచీలు మంగళవారం లాభాల్లో ట్రేడింగ్ ఆరంభించాయి ఉదయం 11 గంటల సమయానికి సెన్సెక్స్ 248 పాయింట్ల లాభంతో 52,621 వద్ద నిఫ్టీ 75 పాయింట్లు లాభపడి 15,766 వద్ద కొనసాగుతున్నాయి. అమెరికా మార్కెట్ల లాభాల ముగింపుతో పాటు ఆసియా మార్కెట్ల సానుకూల ధోరణి దేశీ మార్కెట్ల పై ప్రభావం చూపుతున్నాయి. దేశీయంగా రియల్టీ, పవర్ , బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగాల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.