Equity Market: దేశీ ఈక్విటీ మార్కెట్లు స్వల్ప లాభాలు
Equity Market: అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపథ్యం...
Representational Image
Equity Market: దేశీ ఈక్విటీ మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాల్లో పయనిస్తున్నాయి. ఉదయం పది గంటల సమయంలో సెన్సెక్స్ 114 పాయింట్లు లాభపడి 52,813 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 33 పాయింట్లు ఎగబాకి 15,823 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 74.15 వద్ద కదలాడుతోంది. అయితే క్రితం సెషన్ లాభాల ముగింపు నేపథ్యంలో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపవచ్చన్న అంచనాలు ఎదురవుతున్నాయి.