Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Stock Market: 765 పాయింట్ల లాభాల్లో సెన్సెక్స్ * 56,889 వద్ద ముగిసిన సెన్సెక్స్
Representational Image
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ముగిశాయి. ఉదయం ఉత్సాహంగా ప్రారంభమైన సూచీలు రోజంతా అదే జోరును కనబరిచాయి. సెన్సెక్స్ 765 పాయింట్ల లాభంతో 56 వేల 889 వద్ద ముగిసింది. నిఫ్టీ 225 పాయింట్లు దూసుకెళ్లి 16 వేల 931 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఇవాళ ఓ దశలో 16 వేల 951 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. సానుకూల అంతర్జాతీయ సంకేతాలు, రూపాయి బలపపడం, ఎఫ్‌డీఐల వెల్లువ మార్కెట్ల ర్యాలీకి దోహదం చేశాయని మార్కెట్ నిపుణులు తెలిపారు.