Equity Market: భారత ఈక్విటీ మార్కెట్లు లాభాల ముగింపు
Equity Market: గ్లోబల్ మార్కెట్ల మిశ్రమ సంకేతాల నేపధ్యం * వెరసి రెండు రోజుల వరుస నష్టాలకు చెక్
representational Image
Equity Market: భారత ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.గ్లోబల్ మార్కెట్ల మిశ్రమ సంకేతాల నేపధ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల ముగింపు ద్వారా రెండు రోజుల నష్టాలకు చెక్ చెప్పాయి మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 424 పాయింట్ల లాభంతో 48,677 వద్దకు చేరగా , నిఫ్టీ 121 పాయింట్లు ఎగసి 14,617 వద్ద స్థిరపడ్డాయి..అయితే ఆర్‌బీఐ భారీ ఉపశమన ప్యాకేజీ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ కు బలం చేకూర్చగా కొవిడ్‌కేసుల పెరుగుదల, స్థానిక లాక్‌డౌన్‌లు, నెమ్మదించిన వ్యాక్సిన్‌ల ప్రక్రియ వంటి అంశాలు కొద్దిమేర ప్రతికూల ప్రభావం చూపాయని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.