Stock Market: మూడో రోజు నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
Stock Market: అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్న ఐటీ, మెటల్ షేర్లు * 336.46 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
Representational Image
Stock Market: భారత స్టాక్ మార్కెట్లు మరోసారి నష్టాల్లో ముగిశాయి. ఐటీ, మెటల్ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కోవడంతో వరుసగా మూడో రోజు సూచీలు నష్టపోయాయి. సెన్సెక్స్ 336 పాయింట్లు నష్టపోయి. 60 వేల 923 వద్ద ముగిసింది. నిఫ్టీ 88 పాయింట్లు కోల్పోయి. 18 వేల 178 వద్ద ముగిసింది. ఏసియన్ పెయింట్స్, హిందాల్కో, రిలయన్స్ షేర్లు నష్టపోగా కోటక్ మహీంద్రా, టాటా మోటార్స్, గ్రాసిమ్ షేర్లు లాభపడ్డాయి.