Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
Stock Market: చాలాసేపు ఊగిసలాటలో మార్కెట్లు
Representational Image
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు కూడా లాభాలలో ముగిశాయి. ఈ రోజు ఉదయం నుంచీ మార్కెట్లు నష్టాలలోనే ట్రేడ్ అయ్యాయి. దేశంలో విద్యుత్ సంక్షోభం తలెత్తుతోందన్న భయాలు ఓపక్క అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు మరోపక్క మదుపరులను అప్రమత్తం చేయడంతో ట్రేడింగ్ ఊగిసలాటలో కొనసాగింది. అయితే, కేంద్రం విద్యుత్ సమస్య పరిష్కారం విషయంలో రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేయడంతో మదుపరులలో విశ్వాసం నెలకొని చివరి గంటలో కొనుగోళ్లు జరిగాయి. దీంతో సెన్సెక్స్ 148 పాయింట్ల లాభంతో 60వేల 284 దగ్గర.. నిఫ్టీ 46 పాయింట్ల లాభంతో 17వేల 991 దగ్గర క్లోజ్ అయ్యాయి.