Stock Market: భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
Stock Market: 831 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్ * 258 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
Representational Image
Stock Market: స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. కొద్ది రోజుల నుంచి ఒత్తిడిలో ఉన్న మార్కెట్ ఇవాళ పుంజుకుంది. అంతర్జాతీయ సానుకూల అంశాలతో పాటు దేశీయంగా పలు కీలక గణాంకాలు ఆశాజనకంగా ఉండడంతో సూచీలు దూసుకెళ్లాయి. సెన్సెక్స్ 831 పాయింట్లు పెరిగి. 60 వేల 138 వద్ద ముగిసింది. నిఫ్టీ 258 పాయింట్లు పెరిగి 17 వేల 929 వద్ద ముగిసింది. మెటల్, ఐటీ, రియాల్టీ రంగాల షేర్లకు డిమాండ్ పెరిగింది. వీటితో పాటు జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయికి చేరడం, తయారీ కార్యకలాపాలు పుంజుకోవడంతో మదుపరులు కొనుగోళ్ల వైపు మొగ్గు చూపారు.