Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
Stock Market: సెన్సెక్స్ 456 పాయింట్లు నష్టం
Representational Image
Stock Market: స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. రికార్డుల జోరు నుంచి మంగళవారం వెనక్కి తగ్గిన సూచీలు బుధవారం రోజూ అదే బాటలో పయనించాయి. ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించడంతో సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. టెలికాం మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాలు చూశాయి. సెన్సెక్స్ 456 పాయింట్లు నష్టపోయి 61 వేల 259 వద్ద ముగిసింది. నిఫ్టీ 152 పాయింట్లు కోల్పోయి 18 వేల 266 వద్ద ముగిసింది.