Stock Market: లాభాల్లో ముగిసిన దేశీ ఈక్విటీ మార్కెట్లు
Stock Market: సెన్సెక్స్ 397 పాయింట్ల లాభంతో 52,769 వద్ద క్లోజ్.. * నిఫ్టీ 119 పాయింట్లు లాభపడి 15,812 వద్ద స్థిరం
Representational Image
Stock Market: దేశీ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపధ్యంలో మంగళవారం లాభాల్లో ట్రేడింగ్ ఆరంభించిన సూచీలు రోజంతా అదే జోరును కొనసాగించాయి.. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 397 పాయింట్ల లాభంతో 52,769 వద్దకు చేరగా నిఫ్టీ 119 పాయింట్లు లాభపడి 15,812 వద్ద స్థిరపడ్డాయి. అమెరికా మార్కెట్ల లాభాల ముగింపుతో పాటు ఆసియా మార్కెట్ల సానుకూల ధోరణికి తోడు వ్యాక్సినేషన్‌లో పురోగతి తదితర అంశాలు దేశీ మార్కెట్ల పై సానుకూల ప్రభావం చూపాయి.