Solar Stove: సోలార్‌ స్టవ్‌ వచ్చేసింది.. ఇప్పుడు గ్యాస్‌ బండ అవసరం లేదు..!

Solar Stove: భారతదేశంలోని ప్రముఖ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) ఇంటి లోపల ఉపయోగించే సోలార్ స్టవ్‌ను ప్రవేశపెట్టింది.

Update: 2022-06-27 06:30 GMT

Solar Stove: సోలార్‌ స్టవ్‌ వచ్చేసింది.. ఇప్పుడు గ్యాస్‌ బండ అవసరం లేదు..!

Solar Stove: భారతదేశంలోని ప్రముఖ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) ఇంటి లోపల ఉపయోగించే సోలార్ స్టవ్‌ను ప్రవేశపెట్టింది. దీనిని రీఛార్జ్ చేసుకోవచ్చు. సౌరశక్తితో నడిచే ఈ స్టవ్‌ను వంటగదిలో ఉపయోగించవచ్చు. ఈ స్టవ్‌ను కొనుగోలు చేయడానికి అయ్యే ఖర్చు తప్ప నిర్వహణపై ఎటువంటి ఖర్చు ఉండదు. ఇది శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా చెప్పొచ్చు. ఈ స్టవ్‌కి 'సూర్య నూతన్' అని పేరు.

ఫరీదాబాద్‌లోని IOC రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ అభివృద్ధి చేసిన సూర్య నూతన్ రూఫ్-మౌంటెడ్ PV ప్యానెళ్ల ద్వారా పొందిన సౌరశక్తితో నడుస్తుంది. ఈ స్టవ్‌తో నలుగురితో కూడిన కుటుంబానికి మూడుసార్లు భోజనం సులభంగా తయారు చేయవచ్చు. ఇది మీ వంట గ్యాస్ ధరను సులభంగా తగ్గిస్తుంది. దీన్ని నడపడానికి ఇంధనం లేదా కలప అవసరం లేదు. సూర్యుని శక్తివంతమైన కిరణాలను ఉపయోగించి ఈ కొత్త సోలార్ స్టవ్ పనిచేస్తుంది.

దీని వల్ల వంట ఖర్చు బాగా తగ్గుతుంది. సూర్య నూతన్ ఒక కేబుల్ ద్వారా కనెక్ట్ చేయబడుతుంది. ఇది బయట లేదా పైకప్పుపై ఉన్న సోలార్ ప్లేట్‌కు కనెక్ట్ చేస్తారు. సోలార్ ప్లేట్ నుంచి శక్తి తయారవుతుంది. ఇది పైపు లేదా కేబుల్ ద్వారా సోలార్ స్టవ్‌కు వస్తుంది. సౌరశక్తి మొదట థర్మల్ ప్లేట్‌ను థర్మల్ ఎనర్జీ రూపంలో నిల్వ చేస్తుంది. తద్వారా రాత్రిపూట కూడా ఆహారాన్ని వండుకోవచ్చు.

ఈ సూర్య నూతన్ స్టవ్‌ దేశవ్యాప్తంగా 60 ప్రదేశాలలో ప్రయత్నించారు. నివేదికల ప్రకారం, ప్రస్తుత స్టవ్ ధర రూ. 18000-30,000 మధ్య ఉంది. కానీ ప్రభుత్వ సహాయం తర్వాత ఇది 10 నుంచి 12 వేల మధ్య లభిస్తుంది. దీని జీవితకాలం కనీసం 10 సంవత్సరాలు. కాబట్టి ఒకసారి ఖర్చు చేసి ప్రతి నెలా సిలిండర్ రీఫిల్‌లను వదిలించుకోండి.

Tags:    

Similar News