మరో చారిత్రక కనిష్ఠ స్థాయికి రూపాయి విలువ

Rupee: డాలర్ తో పోలిస్తే మన రూపాయి అత్యంత దుర్భర పరిస్థితి ఎదుర్కొంటోంది.

Update: 2022-06-28 15:30 GMT

మరో చారిత్రక కనిష్ఠ స్థాయికి రూపాయి విలువ

Rupee: డాలర్ తో పోలిస్తే మన రూపాయి అత్యంత దుర్భర పరిస్థితి ఎదుర్కొంటోంది. డాలర్ తో మారకంలో రూపాయి మరో చారిత్రక కనిష్ఠ స్థాయిని నమోదు చేసింది. డాలర్ తో పోలిస్తే ఏకంగా 78 రూపాయల 83 పైసలకు పడిపోయింది. ఇలా రోజూ చారిత్రక కనిష్ఠ స్థాయికి తగ్గిపోవడం వరుసగా ఆరో రోజు. నిన్న మార్కెట్లు ముగిసే సమయానికి 78 రూపాయల 34 పైసల వద్ద రూపాయి విలువ నమోదవగా ఈరోజు ఉదయం మరింత కనిష్ఠంగా 78 రూపాయల 53 పైసల వద్ద ప్రారంభమైంది.

చివరికి 78 రూపాయల 83 పైసల వద్ద ముగిసింది. నిన్నటితో పోలిస్తే రూపాయి విలువ మరో 46 పైసలు పడిపోయింది. క్రూడాయిల్ ధరలు భారీగా పెరుగుతుండటంతో నిత్యావసరాల ధరలు పెరగవచ్చని, భవిష్యత్తులో సుదీర్ఘకాలం ద్రవ్యోల్బణం కొనసాగవచ్చన్న అంచనాలతో రూపాయి పతనమవుతోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

Tags:    

Similar News