వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్‌బీఐ..

Update: 2019-04-04 15:58 GMT

ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ అధ్యక్షతన మూడు రోజుల పాటు సమావేశమైన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) తాజాగా రెపో రేటులో పావు శాతం కోతను ప్రకటించింది. దీంతో వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటు ఏడాది తరువాత మళ్లీ 6 శాతానికి దిగివచ్చింది. ఇప్పటివరకూ 6.25 శాతంగా రెపో రేటు అమలవుతోంది. ఇందుకు ఎంపీసీ 4:2 వోటింగ్‌తో నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఎంఎస్‌ఎఫ్‌తోపాటు.. బ్యాంక్‌ రేటును 6.5 శాతం నుంచి 6.25 శాతానికిఎంపీసీ సవరించింది. అంతేకాకుండా బ్యాంకులు స్వల్పకాలిక నిధులను రిజర్వ్‌ బ్యాంక్‌ వద్ద డిపాజిట్‌ చేస్తే లభించే రివర్స్‌ రెపో రేటు సైతం 6 శాతం నుంచి 5.75 శాతానికి పరిమితంకానుంది.

Similar News