Reliance Jio: రిలయన్స్ జియో బోర్డుకు ముకేశ్ అంబానీ రాజీనామా
Mukesh Ambani: రిలయన్స్ జియో చైర్మన్‌గా ఆకాశ్ అంబానీని బోర్డు ఎన్నుకుంది.
Reliance Jio: రిలయన్స్ జియో బోర్డుకు ముకేశ్ అంబానీ రాజీనామా
Mukesh Ambani: రిలయన్స్ జియో చైర్మన్‌గా ఆకాశ్ అంబానీని బోర్డు ఎన్నుకుంది. రిలయన్స్ జియో డైరెక్టర్ పదవికి ముకేష్ అంబానీ రాజీనామా చేశారు. జియో ఇన్ఫోకామ్ బోర్డుకు సైతం ముకేష్ అంబానీ రాజీనామా చేశారు. తనయుడు ఆకాశ్ అంబానీకి బాధ్యతలు అప్పగించారు. కంపెనీ డైరెక్టర్ పదవికి ముఖేశ్ అంబానీ రాజీనామా చేయడంతో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పంకజ్ మోహన్ పవార్ బాధ్యతలు స్వీకరించారని వెల్లడించింది. సోమవారం (జూన్ 27, 2022) జరిగిన జియో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో ఆ నిర్ణయం తీసుకున్నారు. ముకేశ్ అంబానీ తన వ్యాపార బాధ్యతలను వారసులకు అప్పగించే ప్రణాళికలో భాగంగానే ఈ మార్పు జరిగినట్లు తెలుస్తోంది. ఆకాశ్ 2014లో జియో బోర్డులో చేరారు.