Personal Loan: ఆర్బీఐ కొత్త నిబంధన.. పర్సనల్ లోన్, క్రెడిట్‌ కార్డు తీసుకోవడం కష్టమే..!

Personal Loan: ఇక బ్యాంకు నుంచి పర్సనల్‌ లోన్‌, క్రెడిట్‌ కార్డు తీసుకోవడం కొంచెం కష్టంగానే ఉంటుంది.

Update: 2023-06-30 04:55 GMT

Personal Loan: ఆర్బీఐ కొత్త నిబంధన.. పర్సనల్ లోన్, క్రెడిట్‌ కార్డు తీసుకోవడం కష్టమే..!

Personal Loan: ఇక బ్యాంకు నుంచి పర్సనల్‌ లోన్‌, క్రెడిట్‌ కార్డు తీసుకోవడం కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కొత్త నిబంధన చేర్చింది. ఇప్పటి వరకు బ్యాంకుల నుంచి ఖాతాదారులు సులభంగా రుణాలు, క్రెడిట్‌ కార్డులు పొందుతున్నారు. కానీ ఇప్పుడు అది జరగదు. ఎందుకంటే పర్సనల్ లోన్ లేదా క్రెడిట్ కార్డ్ లోన్ తీసుకునే ప్రక్రియ మరింత బలంగా మారింది. ఆర్‌బీఐ కొత్త నిబంధనల ప్రకారం ఇప్పుడు సామాన్యులు పర్సనల్ లోన్ తీసుకోవడం, క్రెడిట్ కార్డ్ లోన్ తీసుకోవడం అంత సులువు కాదు.

ఇప్పుడు బ్యాంకులు పర్సనల్‌ లోన్‌ , క్రెడిట్‌ కార్డులు జారీ చేసేముందు ఖాతాదారుల బ్యాక్ గ్రౌండ్ చెక్ జరుగుతుంది. ఆర్బీఐ దీనిని తప్పనిసరి చేసింది. ఆ తర్వాతే వినియోగదారులకు రుణం ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తారు. గతంలో పర్సనల్‌ లోన్లకి బ్యాక్‌గ్రౌండ్ చెక్‌ అంతగా చేసేవారు కాదు అలాగే వస్తువులను తాకట్టు కూడా పెట్టవలసిన అవసరం ఉండేది కాదు. కానీ ఇప్పుడు నిబంధనలలో పెద్ద మార్పు వచ్చింది.

RBI కొత్త రూల్స్

RBI కొత్త రూల్ ప్రకారం కస్టమర్లు పర్సనల్ లోన్ తీసుకోవడానికి గ్యారెంటీ అవసరం. ఎందుకంటే నేటి కాలంలో పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డ్ లోన్ తీసుకునే ట్రెండ్ వేగంగా పెరిగింది. దీంతోపాటు రుణాల డిఫాల్టర్ల సంఖ్య కూడా వేగంగా పెరిగింది. ఖాతాదారుల నుంచి గ్యారంటీలు తీసుకోకపోవడంతో బ్యాంకులు భారీగా నష్టపోయాయి. అందుకే ఆర్‌బీఐ కస్టమర్ల ఆర్థిక స్థితిగతులను చెక్ చేయాలని తెలిపింది. తద్వారా వేగంగా పెరుగుతున్న డిఫాల్టర్ల సంఖ్యను తగ్గించవచ్చని సూచించింది.

లెక్కలు ఏం చెబుతున్నాంటే..?

కరోనా తర్వాత సామాన్య ప్రజలు ఎక్కువగా వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డుల వైపు మొగ్గు చూపారు. ఎందుకంటే అవి త్వరగా మంజూరవుతాయి. వీటి ప్రక్రియ కూడా చాలా సులభం. 2022వ సంవత్సరంలో వ్యక్తిగత రుణ గ్రహీతల సంఖ్యలో అత్యధిక పెరుగుదల కనిపించింది. 7.8 కోట్ల నుంచి 9.9 కోట్లకు పెరిగింది. ఇది మాత్రమే కాదు క్రెడిట్ కార్డు ద్వారా రుణాలు తీసుకునే వారి సంఖ్య కూడా 1.3 లక్షల కోట్ల నుంచి 1.7 లక్షల కోట్లకు పెరిగింది.

వ్యక్తిగత రుణం పొందడం కష్టం

ఫిబ్రవరి 2023లో వ్యక్తిగత రుణాలు తీసుకునే వారి సంఖ్య పెరిగింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా, రాబోయే కాలంలో డిఫాల్టర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆర్బీఐ గ్రహించింది. దీని కారణంగా సెంట్రల్ బ్యాంక్ కొత్త రూల్ జారీ చేసింది. పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డ్ లోన్ నిబంధనలను కఠినతరం చేసింది.

Tags:    

Similar News