RBI New Rules: ఆర్‌బీఐ షాకింగ్ న్యూస్.. ఇకపై పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డ్‌లను పొందడం కష్టమే.. కొత్త రూల్స్‌తో పరేషానే..!

Reserve Bank of India: క్రెడిట్ కార్డ్, పర్సనల్ లోన్ ట్రెండ్ వేగంగా పెరుగుతోందని, దీంతో అసురక్షిత రుణాలు ముంచుకొచ్చే ప్రమాదముందని ఆర్‌బీఐ బ్యాంకులను హెచ్చరించింది.

Update: 2023-06-21 14:30 GMT

RBI New Rules: ఆర్‌బీఐ షాకింగ్ న్యూస్.. ఇకపై పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డ్‌లను పొందడం కష్టమే.. కొత్త రూల్స్‌తో పరేషానే..!

RBI on Unsecured Lending: మీరు కూడా రాబోయే కాలంలో పర్సనల్ లోన్ లేదా క్రెడిట్ కార్డ్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా.. అయితే, తిప్పలు తప్పవని తెలుస్తోంది. అవును, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అసురక్షిత రిటైల్ లోన్‌లు, క్రెడిట్ కార్డ్‌లను జారీ చేసే ముందు కస్టమర్ల బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్లను మరింత కఠినతరం చేయాలని బ్యాంకులను కోరినట్లు తెలుస్తోంది. అసురక్షిత రుణాలలో, బ్యాంకుల వద్ద ఏదీ తాకట్టు పెట్టుకోరు. ఇతర రుణాల కంటే వారి వడ్డీ రేటు ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణం.

క్రెడిట్ కార్డ్, పర్సనల్ లోన్ ట్రెండ్ వేగంగా పెరుగుతోంది..

క్రెడిట్ కార్డ్, పర్సనల్ లోన్ ట్రెండ్ వేగంగా పెరుగుతోందని, దీంతో అసురక్షిత రుణాలు ముంచుకొచ్చే ప్రమాదముందని ఆర్‌బీఐ బ్యాంకులను హెచ్చరించింది. డిఫాల్ట్ ప్రమాదం పెరుగుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ అసురక్షిత పోర్ట్‌ఫోలియోను కూడా అరికట్టవచ్చు. కోవిడ్ మహమ్మారి తర్వాత, క్రెడిట్ కార్డ్‌లు, వ్యక్తిగత రుణాల ట్రెండ్ వేగంగా పెరిగింది. గణాంకాల ప్రకారం, 2022 సంవత్సరంలో వ్యక్తిగత రుణాలు తీసుకునే వారి సంఖ్య 7.8 కోట్ల నుంచి 9.9 కోట్లకు పెరిగింది. అదేవిధంగా క్రెడిట్ కార్డుల ద్వారా రుణాలు తీసుకునే వారి సంఖ్య కూడా 28 శాతం పెరిగి రూ.1.7 లక్షల కోట్లకు చేరుకుంది. అంతకుముందు ఇది 1.3 లక్షల కోట్లకు చేరుకుంది.

వ్యక్తిగత రుణాలు రూ.40 లక్షల కోట్లకు..

2023లో కూడా అసురక్షిత రుణాల వేగం వేగంగా పెరుగుతోంది. ఆర్‌బీఐ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఫిబ్రవరి 2022తో పోల్చితే, ఫిబ్రవరి 2023లో వ్యక్తిగత రుణాలు రూ.33 లక్షల కోట్ల నుంచి రూ.40 లక్షల కోట్లకు పెరిగాయి. అంటే అందులో 20.4% పెరుగుదల కనిపించింది. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న వడ్డీ రేట్ల మధ్య అసురక్షిత క్రెడిట్ వృద్ధి ఆందోళన కలిగించే విషయమని ఆర్‌బీఐ అభిప్రాయపడింది.

డిఫాల్ట్ అయ్యే అవకాశం ఉన్న దృష్ట్యా అన్‌సెక్యూర్డ్ రుణాలపై కఠినంగా ఉండాలని రిజర్వ్ బ్యాంక్ కోరడానికి ఇదే కారణమని అంటున్నారు. ఇది కాకుండా, బ్యాంకుల వైపు నుంచి కొన్ని మార్పులు చేయాలని సూచిందంట. అసురక్షిత రుణాలలో రిస్క్ బరువును ఆర్‌బీఐ పెంచవచ్చని వర్గాలు చెబుతున్నాయి.

Tags:    

Similar News