RBI Rules: చిరిగిన కరెన్సీ నోట్లు, టేప్ అతికించిన నోట్లు చెల్లడం లేదా.. ఏం చేయాలంటే..?

RBI Rules: మార్కెట్లో చిరిగిన కరెన్సీ నోట్లు లేదా టేప్ అతికించిన కరెన్సీ నోట్లు ఎవ్వరూ తీసుకోరు.

Update: 2022-02-23 15:30 GMT

RBI Rules: చిరిగిన కరెన్సీ నోట్లు, టేప్ అతికించిన నోట్లు చెల్లడం లేదా.. ఏం చేయాలంటే..?

RBI Rules: మార్కెట్లో చిరిగిన కరెన్సీ నోట్లు లేదా టేప్ అతికించిన కరెన్సీ నోట్లు ఎవ్వరూ తీసుకోరు. దీంతో ఇవి ఎక్కడా చెల్లవని అనుకుంటారు. కానీ ఇప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు వీటికి బదులుగా సరైన కరెన్సీ నోట్లని పొందుతారు. ఎందుకంటే చిరిగిన నోట్ల విషయంలో ఆర్బీఐ నిబంధనలను రూపొందించింది. బ్యాంక్ నిబంధనల ప్రకారం మీరు ఈ నోట్లను ఎలా మార్చుకోవచ్చు పూర్తి డబ్బును ఎలా పొందవచ్చో తెలుసుకుందాం.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 2017 సంవత్సరానికి సంబంధించిన కరెన్సీ నోట్ల మార్పిడి నిబంధనల ప్రకారం.. మీరు ATM నుంచి చిరిగిన నోట్లు వస్తే వాటిని సులభంగా మార్చుకోవచ్చు. ఏ ప్రభుత్వ బ్యాంకులు నోట్ల మార్పిడిని తిరస్కరించలేవు. అలా చేస్తే సదరు బ్యాంకుపై కఠిన చర్యలు తీసుకుంటారు. మీ నోటు ముక్కలుగా చిరిగిపోయినా బ్యాంకు దాన్ని భర్తీ చేస్తుంది. చిరిగిన నోటులో ఏదైనా భాగం కనిపించకపోయినా సులువుగా మార్చుకోవచ్చు. దీని కోసం ఒక ఫారమ్‌ను నింపి ప్రభుత్వ బ్యాంకు, లేదా ప్రైవేట్ బ్యాంక్ లేదా RBI ఇష్యూ కార్యాలయానికి వెళ్లడం ద్వారా మార్చుకోవచ్చు.

అయితే మీకు పూర్తి డబ్బు తిరిగి వస్తుందా లేదా అనేది మీ నోటు పరిస్థితి, నోట్ విలువపై ఆధారపడి ఉంటుంది. కొన్ని మ్యుటిలేటెడ్ నోట్ల విషయంలో పూర్తి డబ్బు అందుబాటులో ఉంటుంది. కానీ నోటు మరింత చిరిగితే మీకు కొంత శాతం డబ్బు తిరిగి వస్తుంది. చిరిగిన నోట్ల మార్పిడికి ఏదైనా బ్యాంకు మిమ్మల్ని నిరాకరిస్తే మీరు ఆర్బీఐకి ఫిర్యాదు చేయవచ్చు. అనేక నివేదికల ప్రకారం ATMల నుంచి మ్యుటిలేటెడ్ నోట్లను మార్చుకోవడానికి ఏ బ్యాంకు నిరాకరించదు. నిబంధనలను ఉల్లంఘిస్తే బ్యాంకు ఉద్యోగులపై చర్యలు తీసుకోవచ్చు. పదివేల వరకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది.

Tags:    

Similar News