ఖాతాదారులకి అలర్ట్‌.. క్రెడిట్‌, డెబిట్‌ కార్డులపై ఆర్బీఐ నిబంధనలు తెలుసుకోండి..!

Credit Debit Cards: క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల జారీపై ఆర్‌బిఐ నిబంధనలు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే.

Update: 2022-07-29 16:00 GMT

ఖాతాదారులకి అలర్ట్‌.. క్రెడిట్‌, డెబిట్‌ కార్డులపై ఆర్బీఐ నిబంధనలు తెలుసుకోండి..!

Credit Debit Cards: క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల జారీపై ఆర్‌బిఐ నిబంధనలు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే. లేదంటే ఖాతాదారులు చాలా నష్టపోవాల్సి ఉంటుంది. ఆర్బీఐ సూచనల ప్రకారం క్రెడిట్ కార్డ్ ఖాతాను క్లోజ్ చేయడంలో ఆలస్యం జరిగితే బ్యాంకులు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులకు సంబంధించిన నిరంతర ఫిర్యాదులపై ఆర్‌బీఐ కఠినంగా వ్యవహరిస్తోంది.

1) క్రెడిట్ కార్డ్‌ను క్లోజ్‌ చేయాలని కస్టమర్‌ సదరు బ్యాంకుని కోరితే ఏడు రోజులలోగా అకౌంట్ క్లోజ్‌ చేయాలి. లేదంటే నిబంధనల ప్రకారం సదరు బ్యాంకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

2) క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేసిన విషయాన్ని కార్డ్ హోల్డర్‌కు ఈ మెయిల్ లేదా SMS ద్వారా తెలియజేయాలి.

3. కార్డ్ జారీచేసిన బ్యాంకు ఏడు రోజులలోపు క్రెడిట్ కార్డ్‌ను మూసివేయకపోతే కస్టమర్‌కు రోజుకు ₹500 పెనాల్టీని చెల్లించవలసి ఉంటుంది.

4. కస్టమర్‌ క్రెడిట్ కార్డ్‌ని ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం ఉపయోగించకుంటే బ్యాంకులు కార్డ్ హోల్డర్‌కు సమాచారం అందించి క్రెడిట్ కార్డ్ ఖాతాను మూసివేసే ప్రక్రియను చేపట్టాలి.

5. ఇది మాత్రమే కాదు 30 రోజుల వ్యవధిలో కార్డ్ హోల్డర్ నుంచి ఎటువంటి స్పందన రాకపోతే బ్యాంకులు కార్డ్ క్లోజ్‌ చేయాలి.

6. క్రెడిట్ కార్డ్ ఖాతా క్లోజ్‌ చేసిన తర్వాత అందులో ఏదైనా క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటే కస్టమర్‌ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయాలి.

7) బ్యాంక్ లేదా కంపెనీ దరఖాస్తు ఫారమ్‌తో పాటు ప్రత్యేక పేజీలో వడ్డీ రేటు, ఫీజు, కార్డ్‌కు సంబంధించిన ఇతర వివరాలు కస్టమర్‌కి తెలియజేయాలి.

8) బ్యాంక్ లేదా కంపెనీ కస్టమర్‌కు ఇన్స్‌రెన్స్‌ కల్పించవచ్చు. తద్వారా కార్డ్ పోయినా లేదా మోసం జరిగినా డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంటుంది.

9. ఆర్బీఐ ఇచ్చిన సమాచారం ప్రకారం దరఖాస్తు చేయకుండా క్రెడిట్-డెబిట్ కార్డ్ జారీ చేస్తే బ్యాంకులకు రెండుసార్లు జరిమానా విధిస్తారు.

Tags:    

Similar News