Repo Rate: ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. కీల‌క వ‌డ్డీ రేట్ల‌లో..

Repo Rate: దేశంలో కోవిడ్ సెకెండ్ వేవ్ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2021-06-04 10:07 GMT

ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత దాస్(ఇమేజ్ సోర్స్ ది హన్స్ ఇండియా )

Repo Rate: దేశంలో కోవిడ్ సెకెండ్ వేవ్ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారంనాడు జరిపిన ద్రవ్యపరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పూ చేయలేదు. రెపో రేటులో ఆర్బీఐ ఎలాంటి మార్పు చేయకపోవడం వరుసగా ఇది ఆరోసారి. ఈ నిర్ణయం రుణగ్రహీతలందరికీ బాగా ఉపయోగకరంగా ఉంటుంది. దీంతో రెపో రేటు 4 శాతంగా, రివ‌ర్స్ రెపో రేటు 3.35 శాతంగా కొన‌సాగ‌నున్న‌ట్లు ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత దాస్ శుక్ర‌వారం ప్ర‌క‌టించారు.

ఇక మార్జిన‌ల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు, బ్యాంకు రేట్లు కూడా 4.25 శాతంగా కొన‌సాగ‌నున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికంలో ఆర్థిక‌ వృద్ధిరేటు 18.5 శాతంగా ఉంటుంద‌ని అంచ‌నా వేసిన‌ట్లు చెప్పారు. అలాగే, రెండో త్రైమాసికంలో వృద్ధిరేటు 7.9గా, మూడో త్రైమాసికంలో 7.2గా, నాలుగో త్రైమాసికంలో 6.6గా ఉంటుంద‌ని అంచ‌నా వేసిన‌ట్లు తెలిపారు. దేశంలో రెండోద‌శ‌ క‌రోనా విజృంభణ కార‌ణంగా విధించిన ఆంక్ష‌ల ప్ర‌భావం ఆర్థిక కార్య‌క‌లాపాల‌పై కొన‌సాగుతుంద‌ని ఆయ‌న చెప్పారు.

Tags:    

Similar News