లక్ష్మీ విలాస్ బ్యాంకుపై చర్యలకు ఉపక్రమించిన ఆర్బీఐ

లక్ష్మీ విలాస్ బ్యాంకుపై రిజర్వ్ బ్యాంకు చర్యలకు ఉపక్రమించింది. నాన్ పర్ఫార్మింగ్ ఆస్తుల నిర్వాహణలో బ్యాంకు అవకతవకలకు పాల్పడినట్లు తెలుస్తోంది.

Update: 2019-09-28 11:25 GMT

లక్ష్మీ విలాస్ బ్యాంకుపై రిజర్వ్ బ్యాంకు చర్యలకు ఉపక్రమించింది. నాన్ పర్ఫార్మింగ్ ఆస్తుల నిర్వాహణలో బ్యాంకు అవకతవకలకు పాల్పడినట్లు తెలుస్తోంది. లక్ష్మీవిలాస్ బ్యాంకు నిబంధనలకు మించి రుణాలు మంజూరు చేసినట్ల తేలింది. మరోవైపు మూలధనం తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా లక్ష్మీ విలాస్ బ్యాంకుకు నోటీసులు జారీ చేసింది. బ్యాంకు నిర్వహణ స్థాయిని పెంచాలన్న ఉద్దేశంతోనే చర్యలకు ఉపక్రమించినట్లు ఆర్బీఐ వెల్లడించింది. రోజువారి లావాదేవిలకు ఎలాంటి విఘాతం ఉండదని స్పష‌్టం చేసింది. సుమారు 790కోట్ల రూపాయిలు నిధులను లక్ష్మీ విలాస్ బ్యాంకు దుర్వినియోగం చేసినట్లు ఫైనాన్షియల్ సర్వీస్ కంపెనీ రెలిగేర్ ఫిన్ వెస్ట్ ఆరోపించింది. లక్ష్మీ విలాస్ బ్యాంకు డైరెక్టర్లు అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఢిల్లీకి చెందిన ఆర్థిక నేరాల శాఖ ఆ బ్యాంకు అధికారులను విచారిస్తుంది.

Tags:    

Similar News