RBI : ఐదోసారి రెపో రేటును 6.5 శాతం వద్ద యథాతథంగా ఉంచిన ఆర్బీఐ

RBI: పో రేటుని యథాతథంగా కొనసాగిస్తున్న ఆర్బీఐ

Update: 2023-12-08 06:06 GMT

RBI : ఐదోసారి రెపో రేటును 6.5 శాతం వద్ద యథాతథంగా ఉంచిన ఆర్బీఐ 

RBI : ద్రవ్యపరిమితి విధానాన్ని ఆర్బీఐ సమీక్షించింది. ఐదవ మానిటరీ పాలసీని ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ప్రకటించారు. కీలక వడ్డీరేట్లలో ఎలాంటి మార్పు లేదని ఆర్బీఐ గవర్నర్‌ తెలిపారు. 6.5 శాతంగా ఉన్న రెపో రేటుని యథాతథంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఆర్బీఐ గవర్నర్‌ నేతృత్వంలోని రేట్ల సెట్టింగ్‌ ప్యానెల్‌ తాజాగా పాలసీ నిర్ణయాన్ని ప్రకటించింది. స్టాండింగ్‌ డిపాజిట్‌ ఫెసిలిటీ రేటు 6.25 శాతం మార్జినల్‌ స్టాండింగ్‌ డిపాజిట్‌ ఫెసిలిటీ రేటు, బ్యాంక్‌ రేటు 6.75గా వెల్లడించింది.

Tags:    

Similar News