RBI: ఆర్బీఐ సంచలన నిర్ణయం.. ఆ నోట్ల విషయంలో కొత్త నిబంధనలు..!

RBI: కరెన్సీ నోట్ల విషయంలో ఆర్బీఐ మరో సంచలన నిర్ణయం తీసుకుంది.

Update: 2022-07-04 15:00 GMT

RBI: ఆర్బీఐ సంచలన నిర్ణయం.. ఆ నోట్ల విషయంలో కొత్త నిబంధనలు..!

RBI: కరెన్సీ నోట్ల విషయంలో ఆర్బీఐ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. తరచుగా ప్రజలు పాత, చిరిగిన నోట్లను ఉపయోగించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే, ఇప్పుడు ఆర్భీఐ నోట్ల ఫిట్‌నెస్‌ను ప్రవేశపెట్టింది. నోట్లను లెక్కించడానికి బదులు నోట్ల ఫిట్‌నెస్‌ను తనిఖీ చేయడానికి యంత్రాలను ఉపయోగించాలని దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులను ఆదేశించింది. ఆర్భీఐ సూచనల ప్రకారం ఇప్పుడు ప్రతి మూడు నెలలకు నోట్ల ఫిట్‌నెస్ తనిఖీ చేస్తారు. ఈ పరిస్థితిలో మీ జేబులో ఉన్న నోటు నలిగిపోయి ఉంటే ఇక అంతే సంగతులు.

ఆర్భీఐ ఈ నిర్ణయం తర్వాత శుభ్రమైన నోట్లు మార్కెట్‌లో చెలామణ అవుతాయి. తద్వారా రీసైక్లింగ్‌లో ఎటువంటి సమస్యలు ఉండవు. అన్ ఫిట్ నోట్లు అంటే రీసైక్లింగ్ కు పనికిరానివని అర్థం. నోటు రంగు పోయినట్లయితే అది పనికిరాని నోటు. చిరిగిన నోటుపై ఏదైనా రకమైన టేప్ అతికించి ఉంటే ఆ నోట్లు పనికిరావు. నోట్ల రంగు పోయి లేదా తేలికగా మారినట్లయితే అవి అన్ ఫిట్ కేటగిరీలో చేర్చుతారు. ఫిట్ నోట్ అనేది వాస్తవమైన తగినంత శుభ్రంగా ఉండే నోటు. రీసైక్లింగ్‌కు అనుకూలంగా ఉంటుంది.

నోటు భౌతిక స్థితిని బట్టి రీసైక్లింగ్‌కు పనికొస్తాయా? లేదంటే ఆ కరెన్సీ నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దశలవారీగా తొలగించి వాటి స్థానంలో కొత్త నోట్లను తయారు చేస్తుంది. ఇలాంటి నోట్లని గుర్తించడానికి కొత్తగా మెషీన్లని తయారుచేస్తోంది. రీసైక్లింగ్‌కు అనువుగా ఉన్న నోట్లను మాత్రమే వినియోగించాలని బ్యాంకులకు తెలిపింది. లేదంటే రీ సైక్లింగ్‌ చేయించాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఉత్తర్వుల్లో పేర్కొంది.

Tags:    

Similar News