కొత్త స్టార్టప్‎ సంస్థను అనౌన్స్ చేసిన రతన్‎టాటా.. సీనియర్ సిటిజన్స్ ఆనందం కోసం 'గుడ్ ఫెలోస్'

Ratan Tata: లాభాపేక్షతో కాకుండా మానవీయ కోణంలో ఆలోచించే ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా మరో కొత్త కాన్సెప్టును అనౌన్స్ చేశారు.

Update: 2022-08-16 15:45 GMT

కొత్త స్టార్టప్‎ సంస్థను అనౌన్స్ చేసిన రతన్‎టాటా.. సీనియర్ సిటిజన్స్ ఆనందం కోసం 'గుడ్ ఫెలోస్'

Ratan Tata: లాభాపేక్షతో కాకుండా మానవీయ కోణంలో ఆలోచించే ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా మరో కొత్త కాన్సెప్టును అనౌన్స్ చేశారు. ఒంటరిగా బతుకులు వెళ్లదిస్తూ.. తమకోసం ఎవరూ లేక, తాము ఎవరికీ పట్టక తమలో తామే కుమిలిపోయే సీనియర్ సిటిజన్ల కోసం ఓ స్టార్టప్ సంస్థను ప్రారంభించారు. గుడ్ ఫెలోస్ పేరుతో ఈ స్టార్టప్ సంస్థ ఇప్పటికే ముంబైలో ప్రారంభమైంది. ముంబైలో పైలట్ ప్రాజెక్టు మాదిరిగా 20 మంది వృద్ధులకు సపర్యలు చేస్తూ.. వారికి శేష జీవితం ఎంతో ఆనందంగా సాగేలా ప్రాజెక్టు పనిచేస్తోంది. తదుపరి ఫేజ్ లో పుణే, చెన్నై, బెంగళూరుల్లో సేవలు ప్రారంభిస్తామన్నారు రతన్.

ఈ ప్రాజెక్టులో ముఖ్యంగా వృద్ధుల కోసం పని చేసే యువకుల్ని తీసుకుంటారు. వారితో ఎంజాయ్ చేస్తూ, ఆడుతూ పాడుతూ.. మెరుగైన సమయం కేటాయించడం ఈ వర్క్ లో ముఖ్యోద్దేశం. క్యారమ్స్, చెస్ లాంటి ఇన్-హౌజ్ గేమ్స్ ఆడించడం, అవసరమైతే సీనియర్ సిటిజన్ల పక్కనే నిద్రించడం చేయాల్సి ఉంటుంది. ఈ స్టార్టప్ కోసం రతన్ టాటా పెద్దమొత్తంలోనే పెట్టుబడులు పెడుతున్నారు. అయితే ఎంతమొత్తం పెడుతున్నారన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. ఆలనాపాలనాకు నోచుకోని వీధికుక్కల పట్ల కూడా రతన్ టాటా ఎంతో శ్రద్ధ చూపిస్తారు. తాజాగా ఆసరా లేని వృద్ధుల కోసం తన మదిలో మెదుల్తున్న ఆలోచనల్ని ఎంతో జాగ్రత్తగా పట్టాలమీదికి ఎక్కిస్తున్నారు రతన్‎టాటా.

గుడ్ ఫెలోస్ ను శంతను నాయుడు ప్రారంభించారు. శంతనునాయుడు టాటా ఆఫీసులో జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. 2018 నుంచి శంతనునాయుడు.. రతన్ కు సహాయకుడిగా ఉన్నారు. శంతను ఐడియాలజీ, కమిట్మెంట్ వంటి అంశాలతో తాదాత్మ్యం చెందిన రతన్ తనలాగే ఒంటరి వృద్ధుల ఆనందం కోసం ఏదైనా చేయాలని తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ఇక గుడ్ ఫెలోస్ పనితీరు గురించి పూర్తిగా తెలియాలంటే ఇంకొద్ది కాలం వేచి ఉండాల్సిందే. 

Tags:    

Similar News