Railone App: రైల్వే సూపర్‌ యాప్‌ వచ్చేసింది.. ఇక అన్ని సేవలూ ఒకేచోట

Railone App: భారతీయ రైల్వే శాఖ అందరికీ ఉపయోగపడే సూపర్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది.

Update: 2025-07-01 09:41 GMT

Railone App: రైల్వే సూపర్‌ యాప్‌ వచ్చేసింది.. ఇక అన్ని సేవలూ ఒకేచోట

Railone App: భారతీయ రైల్వే శాఖ అందరికీ ఉపయోగపడే సూపర్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ‘రైల్‌వన్’ (RailOne Super App) పేరుతో రైల్వే శాఖ ప్రారంభించిన ఈ యాప్ ద్వారా ప్రయాణికులు రైల్వేకు సంబంధించిన అన్ని సేవల్ని ఒకే చోట పొందవచ్చు.

ఇప్పటివరకు రిజర్వేషన్ టికెట్లు, అన్‌రిజర్వ్‌డ్ టికెట్లు, ప్లాట్‌ఫాం టికెట్లు, రైలు ఎంక్వైరీ, పీఎన్‌ఆర్ స్టేటస్, జర్నీ ప్లానింగ్, ఫుడ్ ఆన్ ట్రైన్ వంటి సేవలకు వేర్వేరు యాప్స్ ఉండేవి. వాటన్నింటినీ ఒకే అప్లికేషన్‌లో అందించడమే లక్ష్యంగా ‘స్వరైల్‌’ పేరిట ప్రయోగాత్మకంగా పరీక్షించిన రైల్వే శాఖ..ఇప్పుడు ‘రైల్‌వన్’ పేరిట ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది.

అందుబాటులో ఉన్న సేవలు

ఈ సూపర్ యాప్ ద్వారా ప్రయాణికులు ఇప్పుడు తేలికగా చేయగలిగే సేవలు:

రిజర్వ్‌డ్ / అన్‌రిజర్వ్‌డ్‌ టికెట్లు బుక్ చేసుకోవడం

ప్లాట్‌ఫామ్‌ టికెట్లు కొనడం

రైళ్ల ఎంక్వైరీ & పీఎన్‌ఆర్ స్టేటస్ చెక్ చేయడం

జర్నీ ప్లానింగ్

రైల్ మదద్ సేవలు

ఫుడ్ ఆన్ ట్రైన్ ఆర్డర్ చేయడం

ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు ఈ ‘రైల్‌వన్’ సూపర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. భవిష్యత్తులో మరిన్ని రైల్వే సేవలను ఇందులో జోడించే అవకాశం ఉంది.

ఈ సూపర్ యాప్‌ను సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (CRIS) అభివృద్ధి చేసింది. CRIS వార్షికోత్సవం సందర్భంగా రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ అధికారికంగా ఈ యాప్‌ను ప్రారంభించారు.

Tags:    

Similar News