Pregnant Women Scheme: గర్భిణులకు ఈ స్కీం గురించి తెలుసా.. ఉచితంగా రూ.11,000 అందుకోండి..!

Pregnant Women Scheme: మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టింది.

Update: 2024-03-21 14:30 GMT

Pregnant Women Scheme: గర్భిణులకు ఈ స్కీం గురించి తెలుసా.. ఉచితంగా రూ.11,000 అందుకోండి..!

Pregnant Women Scheme: మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టింది. అందులో ఒకటి ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకం. గ్రామీణ ప్రజలకు చాలామందికి దీని గురించి తెలియదు. ఈ స్కీమ్‌ కింద గర్భిణులకు, పాలిచ్చే తల్లులకు విడతల్లో రూ.11 వేల ఆర్థిక సాయం అందజేస్తోంది. 2017లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ స్కీమ్‌కు అప్లై చేయడం వల్ల గర్భం దాల్చినప్పటి నుంచి 3 వాయిదాలలో డబ్బు చెల్లిస్తుంది. అలాగే ఈ పథకం ద్వారా గర్భిణీలందరికీ ఉచిత మందులు, ప్రెగ్నెన్సీకి ముందు, ఆ తర్వాత పరీక్షలు చేయించుకోవడం వంటి సౌకర్యాలు ఉచితంగా కల్పిస్తారు. ఈ స్కీమ్‌ గురించి మరిన్నివివరాలు తెలుసుకుందాం.

ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకానికి అప్లై చేసుకోవడానికి ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://pmmvy.wcd.gov.inని సందర్శించాలి. తర్వాత సిటిజన్ లాగిన్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత ఒక న్యూ పేజీ ఓపెన్ అవుతుంది. మీ మొబైల్ నంబర్‌ను ఎంటర్‌ చేస్తే అప్లికేషన్‌ ఫారమ్ ఒపెన్ అవుతుంది. అవసరమైన సమాచారాన్ని నమోదు చేయాలి. అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి. ఆపై సబ్మిట్ బటన్‌ను క్లిక్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ నంబర్ వస్తుంది. మీ అప్లికేషన్‌ ధృవీకరించిన తర్వాత ఆర్థిక సాయం బ్యాంక్ అకౌంట్‌లో జమ అవుతుంది.

ఆన్‌లైన్‌లో అప్లికేషన్‌ చేసుకోలేనివారు దగ్గరలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని లేదా ఆరోగ్య కేంద్రానికి వెళ్లాలి. అక్కడ వారిని అడిగి ప్రధాన్ మంత్రి మాతృత్వ వందన యోజన అప్లికేషన్‌ ఫారమ్‌ను పూరించి అవసరమైన పత్రాలను జత చేయాలి. తర్వాత మీకు రశీదు ఇస్తారు. మీరు దానిని కాపాడుకోవాలి. ఎందుకంటే డబ్బులు రాకపోతే ఈ రశీదుతో విచారించవచ్చు. గర్భిణీ ఆధార్ కార్డ్, పిల్లల జనన ధృవీకరణ పత్రం, చిరునామా సర్టిఫికేట్, ఆదాయ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, పాన్ కార్డ్, కొనుగోలు ఖాతా పుస్తకం, మొబైల్ నంబర్, పాస్‌పోర్ట్ సైజు ఫొటో ఇవ్వాల్సి ఉంటుంది. ఈ స్కీమ్‌ నుంచి ప్రయోజనం పొందేందుకు కచ్చితంగా భారత పౌరుడిగా గుర్తింపు పొందాలి. గర్భిణీలకు19 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉండాలి. లేదంటే అప్లికేషన్‌ ఫారమ్‌ చెల్లదు.

Tags:    

Similar News