PM Vidyalaxmi Scheme: విద్యార్థులకు రూ.10 లక్షల రుణం.. ఈ పథకం గురించి మీకు తెలుసా?
PM Vidyalaxmi Education Loan Scheme: నరేంద్రమోదీ ప్రభుత్వం విద్యార్ధుల కోసం ఓ పథకం తెచ్చింది.
PM Vidyalaxmi Scheme: విద్యార్థులకు రూ.10 లక్షల రుణం.. ఈ పథకం గురించి మీకు తెలుసా?
PM Vidyalaxmi Education Loan Scheme: నరేంద్రమోదీ ప్రభుత్వం విద్యార్ధుల కోసం ఓ పథకం తెచ్చింది. పేద, మధ్యతరగతి విద్యార్థులు ఆర్ధిక ఇబ్బందులతో విద్యకు దూరం కాకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకానికి రూపకల్పన చేసింది. 2024 నవంబర్ లో కేంద్ర ప్రభుత్వం పీఎం విద్యాలక్ష్మి పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ పథకం కింద 860 ఉన్నత విద్యా సంస్థల్లో ఆడ్మిషన్ పొందిన విద్యార్థులకు ఆర్ధిక సహాయం అందించనున్నారు. అర్హత పొందిన విద్యార్థులకు ప్రభుత్వం ఏడున్నర లక్షల నుంచి 10 లక్షల వరకు రుణం అందిస్తారు.
ఈ పథకం కింద ప్రతి ఏటా 22 లక్షల మంది విద్యార్ధులకు కేంద్రం అందించనుంది. అయితే దీనికి ఎలాంటి గ్యారంటీ అవసరం లేదు. విద్యార్థులు తమ చదువుల కోసం అవసరమయ్యే రుణం కోసం బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం ఏడున్నర లక్షల వరకు గ్యారంటీని అందించనుంది. అయితే విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయం మేరకు వడ్డీ రేట్లపై కూడా తగ్గింపు కూడా ఉంటుంది. కొందరు విద్యార్థులకు వడ్డీ కూడా ఉండదు.
ఈ పథకాన్ని టెక్నికల్, ప్రొఫెషనల్ కోర్సులు చదివే విద్యార్థులకు 4.5 లక్షల రుణానికి ఎలాంటి వడ్డీ వసూలు చేయరు. 10 లక్షల కంటే ఎక్కువ రుణం తీసుకొంటే ఈ పథకం వర్తించదు. 10 లక్షల వరకు లోన్ తీసుకున్న విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయం 8 లక్షలు ఉంటే వడ్డీని 3 శాతం కేంద్రమే భరిస్తుంది.
ఈ పథకం కింద టాప్ ఉన్నత విద్యా సంస్థల్లో ఆడ్మిషన్లు పొందిన విద్యార్థుల్లో నేషనల్, రాష్ట్ర స్థాయిల్లో టాప్ ర్యాంకులు పొందాలి. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 2024-25 నుంచి 2030-31 వరకు రూ.3,600 కోట్లు కేటాయించింది. పీఎం విద్యాలక్ష్మి వెబ్ పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవాలి.ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు, ఆడ్మిషన్ల వివరాలు, దరఖాస్తుదారుడికి సంబంధించిన అవసరమైన వివరాలను జతపర్చాలి.