Chhattisgarh: పదో తరగతిలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ విద్యార్థినికి బ్లడ్ క్యాన్సర్

State first-ranked student in 10th grade diagnosed with blood cancer
x

Chhattisgarh: పదో తరగతిలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ విద్యార్థినికి బ్లడ్ క్యాన్సర్

Highlights

Chhattisgarh: ఛత్తీస్ గఢ్ లో ఇటీవల విడుదలైన పదవ తరగతి పరీక్షల ఫలితాల్లో స్టేట్ టాపర్ గా నిలిచిన ఇషికా బాలా అనే విద్యార్థికి బ్లడ్ క్యాన్సర్ సోకింది....

Chhattisgarh: ఛత్తీస్ గఢ్ లో ఇటీవల విడుదలైన పదవ తరగతి పరీక్షల ఫలితాల్లో స్టేట్ టాపర్ గా నిలిచిన ఇషికా బాలా అనే విద్యార్థికి బ్లడ్ క్యాన్సర్ సోకింది. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చదువులో మాత్రం ఆమె వెనకడుగు వేయలేదు. ఆ అమ్మాయి చికిత్స కోసం ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. కాంకేర్ జిల్లాకు చెందిన ఇషికా బ్లడ్ క్యాన్సర్ తో ఒక సంవత్సరం పాటు చదువుకు దూరం అయ్యింది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సాహంతో మళ్లీ చదువు మొదలు పెట్టింది. ఛత్తీస్ గఢ్ సెకండరీ బోర్డు పరీక్షల్లో 99.17 శాతం మార్కులు సాధించి స్టేట్ టాపర్ గా నిలిచిన బాలిక ఇషిక... ఐఏఎల్ కావాలన్నది తన కల అని ఈ చదువుల తల్లి చెబుతోంది. సామాన్య రైతు కుటుంబం కావడంతో ఆమె తండ్రి శంకర్ ఆమె చికిత్స కోసం ఇప్పటికే రూ. 15లక్షల వరకు ఖర్చు చేశారు. ప్రధానమంత్రి స్వాస్థ్య సహాయత యోజన కింద ఇషిక ఆరోగ్యం మెరుగుపడటానికి అవసరమైన సహాయం అందేలా చూస్తామని జిల్లా విద్యాశాఖాధికారి అశోక్ కుమార్ పటేల్ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories