రైతులకి అలర్ట్‌.. 60 ఏళ్లు దాటితే రూ.3000 పెన్షన్..!

PM Kisan Mandhan Yojana: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రారంభిస్తున్నారు.

Update: 2022-09-13 06:30 GMT

రైతులకి అలర్ట్‌.. 60 ఏళ్లు దాటితే రూ.3000 పెన్షన్..!

PM Kisan Mandhan Yojana: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రారంభిస్తున్నారు. ఈ పథకాలలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఒకటి. ఈ పథకం కింద ఎంపికైన రైతులకు ప్రతి సంవత్సరం రూ.2 వేల చొప్పున సంవత్సరానికి రూ.6వేలు అందిస్తున్నారు. ఈ స్కీంలో చేరిన రైతులు అలాగే పీఎం కిసాన్ మాన్‌ధన్‌ యోజనలో కూడా చేరవచ్చు. ఇందులో చేరడం వల్ల నెలకి 3 వేల రూపాయల పెన్షన్‌కి అర్హులు అవుతారు. దీని గురించి వివరంగా తెలుసుకుందాం.

నిజానికి ఈ పథకం దేశంలోని చిన్న, సన్నకారు రైతుల సంక్షేమం కోసం రూపొందించారు. ఈ పథకం కింద 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల రైతులు పేర్లని నమోదు చేసుకోవాలి. వయస్సు ప్రకారం ప్రతినెలా ప్రభుత్వ ఖాతాలో రూ.55 నుంచి రూ.200 వరకు డబ్బులు చెల్లించాలి. ఇలా 60 ఏళ్ల వరకు చెల్లించాలి. రైతు వయసు 60 ఏళ్లు దాటగానే వాయిదాలు ఆటోమేటిక్‌గా ఆగిపోతాయి. తర్వాత ప్రభుత్వం ప్రతి నెలా 3 వేల రూపాయల పెన్షన్ అందజేస్తుంది.

పీఎం కిసాన్ మాన్‌ధన్‌ యోజన లో పేరు చేర్చడానికి ముందుగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధిలో నమోదు చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ తర్వాత మీరు పీఎం కిసాన్‌లో పేరును చేర్చడానికి ఒక ఫారమ్‌ను పూరించి దరఖాస్తు చేయాలి. తర్వాత మీ వాయిదా డబ్బులు ప్రతి నెలా పెన్షన్ స్కీమ్‌కు కట్‌ అవుతూ ఉంటాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ వాయిదాలు చెల్లించాల్సిన అవసరం లేదు. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఒక సంవత్సరంలో పొందే 6 వేల రూపాయల నుంచి ఈ డబ్బులు కట్‌ అవుతాయి. తర్వాత రు మిగిలిన మొత్తాన్ని రైతులకి అందజేస్తారు. మీకు 60 ఏళ్లు రాగానే ప్రభుత్వం నుంచి నెలకు రూ.3 వేలు పెన్షన్ అందుతుంది. 

Tags:    

Similar News