PM Awas Yojana: పీఎం ఆవాస్ యోజన అప్‌డేట్.. 45 రోజుల్లో ఇంటి సమస్యకి చెక్..!
PM Awas Yojana: మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కోసం దరఖాస్తు చేసుకొని ఎటువంటి లబ్ధి పొందకపోతే టెన్షన్ పడవద్దు.
PM Awas Yojana: పీఎం ఆవాస్ యోజన అప్‌డేట్.. 45 రోజుల్లో ఇంటి సమస్యకి చెక్..!
PM Awas Yojana: మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కోసం దరఖాస్తు చేసుకొని ఎటువంటి లబ్ధి పొందకపోతే టెన్షన్ పడవద్దు. కేవలం ఒక కాల్‌తో మీ ఇంటికి సంబంధించిన సమస్యపై ఫిర్యాదు చేయవచ్చు. దేశంలోని నిరుపేదలకు పక్కా గృహాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీమ్‌కి సంబంధించి ఏదైనా సమస్య ఉంటే ఎలా ఎదుర్కోవాలో తెలుసుకుందాం.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని 2015 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం కింద 2022 నాటికి మురికివాడలు, కచ్చా గృహాలలో నివసించే ప్రజలకు ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో పాటు ప్రభుత్వం సబ్సిడీ సౌకర్యం అందిస్తుంది. ఈ పథకంలో భాగంగా పట్టణ గృహనిర్మాణానికి రూ.2.67 లక్షలు, గ్రామీణ గృహనిర్మాణానికి రూ.1.67 లక్షలు సబ్సిడీగా చెల్లిస్తారు.
ఈ నంబర్లకి ఫిర్యాదు చేయవచ్చు
1. రాష్ట్ర స్థాయి టోల్-ఫ్రీ నంబర్: 1800-345-6527
2. మొబైల్ నంబర్ లేదా వాట్సాప్ నంబర్: 7004-19320
3. గ్రామీణ స్థాయి టోల్-ఫ్రీ నంబర్: 1800-11-6446
4. NHB (NHB, అర్బన్) – 1800-11-3377, 1800- 11-3388
5. హడ్కో - 180011-6163
45 రోజుల్లో సమస్య పరిష్కారం
మీ ఫిర్యాదు నమోదు చేసిన 45 రోజుల వ్యవధిలో సమస్యని పరిష్కరిస్తారు. ఇది కాకుండా మీరు మరింత సమాచారం కోసం బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌ను సంప్రదించవచ్చు. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద మూడు లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్నవారు, ఇల్లు లేని ఎవరైనా సద్వినియోగం చేసుకోవచ్చు. 2.50 లక్షల సాయం అందిస్తారు. ఇందులో మూడు విడతలుగా డబ్బులు చెల్లిస్తారు. మొదటి విడతగా 50 వేలు, రెండో విడతగా 1.50 లక్షలు, మూడో విడతగా 50 వేలు ఇస్తారు. మొత్తం రూ.2.50 లక్షలకు రాష్ట్ర ప్రభుత్వం 1 లక్ష ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం 1.50 లక్షల గ్రాంట్ ఇస్తుంది.