దేశంలోని మెట్రోనగరాల్లో నిలకడగా పెట్రో ధరలు..
* వారం రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నపెట్రో ధరలు * పెట్రోలియం సరఫరా కంపెనీల రోజువారీ ధరల సమీక్ష * ఇప్పటికే గరిష్టస్థాయిని తాకిన పెట్రో ధరలు
Representational Image
దేశంలోని మెట్రోనగరాల్లో పెట్రో ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. వారం రోజులుగా పెట్రో ధరలు స్థిరంగా కొనసాగుతున్నప్పటికీ, ఇప్పటికే గరిష్టస్థాయిని తాకాయి పెట్రోలియం సరఫరా కంపెనీల రోజువారీ ధరల సమీక్ష ఫలితంగా రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ 86 రూపాయల 30 పైసలు, డీజిల్ 76 రూపాయల 48 పైసలు వద్దకు చేరాయి. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 89రూపాయల 77 పైసలు డీజిల్ ధర లీటర్ 83 రూపాయల 46 పైసలు వద్ద కొనసాగుతున్నాయి కాగా తాజా బడ్జెట్ లో అగ్రి సెస్సు విధించినప్పటికీ దాని భారం వినియోగదారులపై వుండబోదంటూ కేంద్రం ఇచ్చిన హామీతో వినియోగదారులకు ఊరట లభించినట్లయింది.