దేశీయంగా మరోమారు పెరిగిన పెట్రో ధరలు...

Update: 2020-12-03 06:16 GMT

దేశీయంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరోమారు పెరిగాయి. రెండు వారాల వ్యవధిలో వరుసగా 11 సార్లు ధరలను చమురు సరఫరా కంపెనీలు సవరించాయి. రాజధాని ఢిల్లీ లో పెట్రోల్ ధర 17 పైసలు మేర పెరగ్గా డీజిల్ ధర 19 పైసలు చొప్పున పెరిగింది. తాజా పెంపుదలతో ఢిల్లీ సహా కోల్‌కతా, ముంబై, చెన్నై వంటి నాలుగు ప్రధాన మెట్రో నగరాల్లో పెట్రో ధరలు మరింత భారంగా మారాయి. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 17 పైసలు పెరిగి 85 రూపాయల 97 పైసలు వద్దకు చేరగా, డీజిల్ ధర లీటర్‌కు 21 పైసలు పెరిగి 79 రూపాయల 48 పైసలు వద్ద కొనసాగుతున్నాయి. గ్లోబల్ మార్క్టెట్ లో ముడి చమురు ధరల పెంపు ప్రభావం దేశీయంగా పెట్రో ధరల భారానికి కారణమని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Tags:    

Similar News