మెట్రో నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు మళ్లీ రెక్కలు..

Update: 2020-11-20 12:18 GMT

దేశంలోని మెట్రో నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. దేశంలో ఇంధన ధర గత 48 రోజులుగా యధాతధంగా వుండగా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు తాజాగా రేట్లను సవరించాయి. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 22 పైసలు పెరిగి 85 రూపాయల 47 పైసలు వద్దకు చేరగా డీజిల్ ధర లీటర్‌కు 28 పైసలు పెరిగి 77 రూపాయల 12 పైసలు వద్ద కొనసాగుతున్నాయి.

ఇక గ్లోబల్ మార్కెట్ విషయానికి వస్తే ముడిచమురు ధరలకు కోవిడ్ సెకండ్ వేవ్ ప్రకంపనలు తప్పడం లేదు. ప్రస్తుతం లండన్‌ మార్కెట్లో బ్రెంట్‌ చమురు బ్యారల్‌ 0.25 శాతం పెరిగి 44.30 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక న్యూయార్క్‌ మార్కెట్లో నైమెక్స్‌ బ్యారల్‌ 41.74 డాలర్లుగా నమోదయింది.

Tags:    

Similar News