Paytm Payments : పేటీఎం కస్టమర్లకు శుభవార్త

Paytm Payments : పేటీఎంకు చెందిన పేమెంట్స్ బ్యాంకు కస్టమర్లకు శుభవార్త చెప్పింది.. అధార్ ఆధారిత పేమెంట్ సర్వీస్ (APE)ను ఆవిష్కరించింది..

Update: 2020-08-24 10:32 GMT

Paytm 

Paytm Payments : పేటీఎంకు చెందిన పేమెంట్స్ బ్యాంకు కస్టమర్లకు శుభవార్త చెప్పింది.. అధార్ ఆధారిత పేమెంట్ సర్వీస్ (APE)ను ఆవిష్కరించింది.. దీని ద్వారా అధార్ కార్డుల ద్వారా క్యాష్ విత్ డ్రా, బ్యాలెన్స్ ఎంక్వయిరీ లాంటి సేవలని అందుబాటులోకి తీసుకువచ్చింది. అధార్ తో అనుసంధానం అయిన దేశంలోని బ్యాంక్ అకౌంట్ కలిగిన వారు ఎవరైనా ఏఈపీఎస్ సర్వీసులతో క్యాష్ విత్‌డ్రాయెల్స్, బ్యాలెన్స్ విచారణ వంటి సేవలు పొందవచ్చని కంపెనీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది త్వరలోనే క్యాష్ డిపాజిట్, ట్రాన్స్ఫర్ లాంటి సౌకర్యాలను లాంఛ్ చేయాలనీ భావిస్తోంది.

ఈ ఏఈపీఎస్ సర్వీసులతో దేశంలో ఆర్థిక సేవలను వేగవంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, దేశంలోని మారుమూల ప్రాంతంలోని ప్రజలు పూర్తి బ్యాంకింగ్ సేవలను పొందగలిగేలా చూడడమే తమ లక్ష్యమని పేర్కొంది. ఇందు కోసం 10వేలకి పైగా వ్యాపార కరస్పాండెంట్లతో భాగస్వామ్యం చేసుకున్నట్లుగా పేటీఎం చెల్లింపుల బ్యాంక్ సిఇఒ, మేనేజింగ్ డైరెక్టర్ సతీష్ కుమార్ గుప్తా వెల్లడించారు.  

Tags:    

Similar News