Maruti Suzuki: నెలకు రూ. 11 వేలు చెల్లిస్తే చాలు.. ఈ కొత్త కారు మీ ఇంటికొచ్చేస్తుంది..!

Maruti Wagon R: మారుతి కార్లకు దేశీయంగా ఉన్న ఆదరణ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Update: 2024-12-11 11:10 GMT

Maruti Suzuki: నెలకు రూ. 11 వేలు చెల్లిస్తే చాలు.. ఈ కొత్త కారు మీ ఇంటికొచ్చేస్తుంది..!

Maruti Wagon R: మారుతి కార్లకు దేశీయంగా ఉన్న ఆదరణ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మార్కెట్లోకి ఎన్ని రకాల కొత్త కార్లు వచ్చినా మారుతి కార్లకు మాత్రం డిమాండ్‌ ఎప్పటికీ తగ్గదు. మారుతి సుజుకీలో భారీగా ఆదరణ లభించిన కార్లలో వ్యాగనార్‌ కూడా ఒకటి. ఈ కారు భారీ అమ్మకాలు జరుపుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సరికొత్త లుక్స్‌తో వచ్చిన వ్యాగనార్‌ కారును నెలకు కేవలం రూ. 11 వేలు ఈఎమ్‌ఐ చెల్లిస్తే చాలు మీ సొంతం చేసుకోవచ్చు. ఇందుకోసం ఎంత డౌన్‌ పేమెంట్ కట్టాలి.? బ్యాంకులు ఎంత లోన్‌ అందిస్తాయి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మారుతి సుజుకి ఎల్‌ఎక్స్‌ఐ సీఎన్‌జీ బేస్‌ మోడల్‌ ధర రూ. 6.45 లక్షల ఆన్‌రోడ్‌ ధరగా ఉంది. ఈ కారును సొంతం చేసుకోవాలంటే కనీసం రూ. లక్ష డౌన్‌పేమెంట్‌ చెల్లించాల్సి ఉంటుంది. ఇక బ్యాంకులు ఈ కారుకు కావాల్సిన మిగతా మొత్తాన్ని రుణం రూపంలో అందిస్తుంటాయి. షోరూమ్‌లోనే ఇందుకు సంబంధించిన సమాచారం పొందొచ్చు.

సాధారణంగా కారు లోన్‌పై 9.8 శాతం వడ్డీ వసూలు చేస్తాయి బ్యాంకులు. ఇలా మీరు రూ. 5.45 లక్షల రుణం పొందుతారు. ఉదాహరణకు మీరు ఐదేళ్ల ఈఎమ్‌ఐ ఆప్షన్‌ సెలక్ట్‌ చేసుకుంటే.. మీరు ప్రతీ నెల రూ. 11,000 ఈఎమ్‌ఐ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. అయితే వడ్డీ రేటు అనేది మీ క్రెడిట్‌ స్కోర్‌పై ఆధారపడి ఉంటుందని తెలుసుకోవాలి.

ఇక ఫీచర్ల విషయానికొస్తే.. మారుతి సుజుకి వ్యాగనార్‌ సిఎన్‌జిలో 1.0 లీటర్ ఇంజన్‌ని అందించారు. ఇది గరిష్టంగా 57బిహెచ్‌పి పవర్, 89ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్‌తో కారు అందుబాటులో ఉంది. ఇక మైలేజ్‌ విషయానికొస్తే కిలో సీఎన్‌జీతో 32.52 నుంచి 34.05 కి.మీల వరకు ఇస్తుంది. వ్యాగనార్‌ సీఎన్‌జీ ఎల్‌ఎక్స్‌ఐ, వీఎక్స్‌ఐ అనే రెండే వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. 

Tags:    

Similar News