Tata Group: టాటా చేతుల్లోకి మరో కంపెనీ.. 12,100 కోట్లకి విక్రయించే అవకాశం..

Tata Group: టాటాగ్రూప్స్ వ్యాపారం రంగంలో తనకు తిరుగులేదని మరోసారి నిరూపిస్తుంది.

Update: 2022-02-01 12:45 GMT

Tata Group: టాటా చేతుల్లోకి మరో కంపెనీ.. 12,100 కోట్లకి విక్రయించే అవకాశం..

Tata Group: టాటాగ్రూప్స్ వ్యాపారం రంగంలో తనకు తిరుగులేదని మరోసారి నిరూపిస్తుంది. ఇటీవల ఎయిర్‌ ఇండియాని కొనుగోలు చేసిన టాటా తాజాగా మరో కంపెనీ కొనుగోలుకు సిద్దంగా ఉంది. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ నీలాంచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (NINL) ను టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్‌ 12,100 కోట్ల రూపాయలకు విక్రయించే ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించింది. NINL అనేది 4 ప్రభుత్వ రంగ సంస్థలు MMTC లిమిటెడ్, నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, BHEL, MECON లిమిటెడ్‌లతో సహా ఒడిషా ప్రభుత్వానికి చెందిన రెండు కంపెనీల జాయింట్ వెంచర్.

NINL ఒడిశాలోని కళింగనగర్‌లో 11 లక్షల టన్నుల సామర్థ్యంతో ఉక్కు కర్మాగారాన్ని కలిగి ఉంది. కంపెనీ భారీ నష్టాల్లో నడుస్తోంది ఈ ప్లాంట్ 30 మార్చి 2020 నుంచి మూసివేసారు. NINLని కొనుగోలు చేయడానికి జిందాల్ స్టీల్ & పవర్ లిమిటెడ్, నల్వా స్టీల్ & పవర్ లిమిటెడ్, JSW స్టీల్ లిమిటెడ్, టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (TSLP) కన్సార్టియం ఆర్థిక బిడ్‌లు వేసింది. ఇందులో టీఎస్‌ఎల్‌పీ అతిపెద్ద బిడ్డర్‌గా నిలిచింది.

TSLPకి లెటర్ ఆఫ్ ఇంటెంట్ (LOI) జారీ చేస్తారు. NINL కోసం ప్రభుత్వం రూ. 5,616.97 కోట్ల రిజర్వ్ ధరను నిర్ణయించింది. దీని కోసం TSLP బిడ్‌ను రెట్టింపు చేసింది. ఎన్‌ఐఎన్‌ఎల్‌లో ప్రభుత్వానికి ఈక్విటీ వాటా లేదు కాబట్టి అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయంలో దానికి ఎలాంటి వాటా ఉండదు. ఈ సొమ్ము రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన నాలుగు ప్రభుత్వ రంగ సంస్థలు, రెండు పీఎస్‌యూల ఖాతాలకు చెందుతుంది. నీలాంచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఒడిషాలో ఉంది. టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ లేదా TSLP.. NINL కొనుగోలు కోసం అత్యధికంగా రూ.12,100 కోట్ల బిడ్ చేసింది. దాని విక్రయానికి ప్రభుత్వం రూ. 5,616.97 కోట్ల రిజర్వ్ ధరను నిర్ణయించింది. కానీ ఇది రెట్టింపు మొత్తాన్ని పొందింది. 

Tags:    

Similar News