ఎంతగానో ఎదురుచూస్తున్న వన్‌ప్లస్ 7 సిరీస్ ఇండియా మార్కెట్ లోకి వచ్చేసింది. బెంగళూరులో వన్‌ప్లస్ 7, వన్‌ప్లస్ 7 ప్రో స్మార్ట్ఫోన్లను కంపెనీ అధికారికంగా రిలీజ్ చేసింది. వన్‌ప్లస్ 7, వన్‌ప్లస్ 7 ప్రో స్మార్ట్ఫోన్లతో పాటు వన్‌ప్లస్ బుల్లెట్స్ వైర్లెస్ ఇయర్‌ఫోన్స్‌ను కూడా రిలీజ్ చేసింది కంపెనీ. వీటి ధర రూ.5,990. వన్‌ప్లస్ 7 ప్రోలో మూడు వేరియంట్లు ఉన్నాయి. ఈ రెండు ఫోన్లకు ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, వాటర్ రెసిస్టెంట్, 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లు ప్రత్యేకం.
వన్‌ప్లస్ 7 ప్రో నెబ్యులా మిర్రర్ గ్రే కలర్ స్మార్ట్‌ఫోన్ సేల్ అమెజాన్‌లో ఎక్స్‌క్లూజీవ్ గా అమ్మకం జరుగుతోంది. మే 17న సేల్ ప్రారంభమవుతుంది. నెబ్యులా బ్లూ కలర్ మే 25 నుంచి అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. అమెజాన్ ఇండియాతో పాటు వన్‌ప్లస్ వెబ్సైట్, ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో కూడా 7 ప్రో నెబ్యులా మిర్రర్ గ్రే కలర్ ఫోన్లు అందుబాటులో ఉండనున్నాయి. అమెజాన్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డులపై కొన్నవారికి రూ.2000 ఇన్స్టంట్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.