Old Currency: ఇంకా పాత 500, 1000 నోట్లను మార్చుకునే అవకాశం.. ఎలాగంటే..?

Old Currency: మీ వద్ద ఇప్పటికీ పాత 500, 1000 రూపాయల నోట్లు ఉంటే వాటిని మార్చుకోవడానికి ఇంకా అవకాశం ఉంది.

Update: 2022-11-26 11:05 GMT

Old Currency: ఇంకా పాత 500, 1000 నోట్లను మార్చుకునే అవకాశం.. ఎలాగంటే..?

Old Currency: మీ వద్ద ఇప్పటికీ పాత 500, 1000 రూపాయల నోట్లు ఉంటే వాటిని మార్చుకోవడానికి ఇంకా అవకాశం ఉంది. నోట్ల రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఒక ప్రకటనలో పాత కరెన్సీ నోట్లను మార్చుకోవాలనుకునే వ్యక్తులు చేసిన నిజమైన దరఖాస్తులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. నోట్ల మార్పిడికి వారికి మరో అవకాశం ఇవ్వాలని తెలిపింది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణ డిసెంబర్ 5న జరగనుంది.

దేశవ్యాప్తంగా చాలా మందికి ఇంటిని శుభ్రం చేస్తున్నప్పుడు పాత 500, 1000 నోట్లు దొరికే ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు వాటినిన జ్ఞాపికగా ఉంచుకోగా మరికొంత మంది పనికిరానివిగా భావించి పారేసేవారు ఉంటారు. అయితే ఆ నోట్లను భద్రంగా ఉంచుకున్న వ్యక్తులు ఇప్పటికీ వాటిని మార్చుకునే అవకాశాన్ని పొందవచ్చు. ఒక నివేదిక ప్రకారం భారత అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి మాట్లాడుతూ నోట్ల రద్దు తేదీలను పొడిగించలేమని అయితే రిజర్వ్ బ్యాంక్ కొన్ని వ్యక్తిగత కేసులను దరఖాస్తుదారులకు అవసరమైన షరతులకి లోబడి పరిశీలిస్తుందని తెలిపారు.

నోట్ల రద్దు నోటిఫికేషన్‌ను అటార్నీ జనరల్ కోర్టులో సమర్థించారు. నకిలీ నోట్లు, నల్లధనం, ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు నోట్ల రద్దును అమలు చేశామన్నారు. రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934 నిబంధనల ప్రకారం నోట్ల రద్దును అమలు చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. నోట్ల రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. కోటి రూపాయలకు పైగా పాత నోట్లను తన వద్ద ఉంచుకున్నట్లు ఓ పిటిషనర్ తెలిపారు. దీనిపై న్యాయస్థానం.. వాటిని జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించింది. నోట్ల రద్దు సమయంలో తాను విదేశాల్లో ఉన్నానని సదరు పిటిషనర్‌ తెలిపారు.

Tags:    

Similar News