Indian Railway: రైల్వే ప్రయాణికులకి గమనిక.. రైలు ఆలస్యమైతే ఉచితంగా ఆహారం..!

Indian Railway: చలికాలం కొనసాగుతోంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో పొగమంచు సమస్య ఏర్పడుతుంది.

Update: 2023-01-05 15:30 GMT

Indian Railway: రైల్వే ప్రయాణికులకి గమనిక.. రైలు ఆలస్యమైతే ఉచితంగా ఆహారం..!

Indian Railway: చలికాలం కొనసాగుతోంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో పొగమంచు సమస్య ఏర్పడుతుంది. ఈ పరిస్థితుల్లో కొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అందుకే భారతీయ రైల్వే ఒక ప్రత్యేక సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. ప్రయాణికులు తప్పకుండా దీనిని సద్వినియోగం చేసుకోవాలి. రైలు ఆలస్యం అయినప్పుడు ప్రయాణికులకు ఉచిత ఆహారం, నీరు, స్నాక్స్ అందిస్తుంది. మీరు ఈ పథకాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం.

ప్రయాణికులకు రైల్వేశాఖ ఉచితంగా అనేక సౌకర్యాలు కల్పిస్తోంది. ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవడం మీ హక్కు. అయితే చాలా మందికి వీటిపై అవగాహన లేదు. రైలు ఆలస్యంగా నడిచినా లేదా ఏదైనా కారణం వల్ల ఆలస్యంగా వచ్చినా భారతీయ రైల్వే ప్రయాణికులకు ప్రత్యేక సౌకర్యాలను అందిస్తుంది. రైల్వే నిబంధనల ప్రకారం రైలు రెండు గంటలు లేదా అంతకంటే ఎక్కువ ఆలస్యం అయితే, ప్రయాణికులకు ఉచిత అల్పాహారం, ఆహారం అందిస్తారు. అయితే ఎంపిక చేసిన కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లలో మాత్రమే ఈ సౌకర్యం ఉంది. ఈ రైళ్లలో రాజధాని, శతాబ్ది, దురంతో ఎక్స్‌ప్రెస్ ఉన్నాయి.

చలికాలంలో పొగమంచు కారణంగా చాలా సార్లు రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా నడుస్తాయి. ఈ పరిస్థితిలో మీ రైలు కూడా ఆలస్యం అయితే ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. IRCTC ఈ సౌకర్యాన్ని ప్రయాణికులకు అందిస్తుంది. కానీ ఆహారం మీకు చేరకపోతే మీరు IRCTC నుంచి ఈ సౌకర్యాన్ని డిమాండ్ చేయవచ్చు. రైల్వేలు అల్పాహారం కోసం టీ లేదా కాఫీ, బిస్కెట్లు అందజేస్తాయి. అదే సమయంలో, సాయంత్రం అల్పాహారంలో టీ లేదా కాఫీ, బటర్ చిప్లెట్, నాలుగు బ్రెడ్లు ఇస్తారు. మధ్యాహ్నం భోజన సమయంలో పప్పు, రోటీ, కూరగాయలు ఇస్తారు. కొన్నిసార్లు పూరీ కూడా వడ్డిస్తారు.

Tags:    

Similar News